YS Jagan : జగన్ కొంత కాలం నోరు తెరవకపోవడమే మంచిదట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు..!
ప్రధానాంశాలు:
YS Jagan : జగన్ కొంత కాలం నోరు తెరవకపోవడమే మంచిదట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు..!
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది జగనేనని విమర్శించారు. గతంలో చంద్రబాబు సూచనతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీకి వెళ్లామని… ప్రాజెక్టు కోసం అప్పటి కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. అయితే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
YS Jagan సైలెంట్‌గా ఉండు..
ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వ్యవస్థలను ఐదేళ్ల పాటు నాశనం చేశారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు పోయి మూడేళ్లైనా దాన్ని పెట్టలేని దుస్థితిలో గత వైసీపీ ప్రభుత్వం ఉందని గొట్టిపాటి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని, పులిచింతల గేటు కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ఇసుక దోపిడీతో ప్రాజెక్టుల భద్రతకు ముప్పు వాటిల్లిందని అన్నారు. జగన్ కొంత కాలం పాటు నోరు తెరవకపోవడమే మంచిదని, లేకపోతే ప్రజలు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్న గొట్టిపాటి రవికుమార్.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లయినా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. వైసీపీ పాలనలో పులిచింతలలో గేటుతో పాటుగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారనే విషయమ మర్చిపోయి.. వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ కొన్నిరోజుల పాటు నోరు తెరవకపోవటం మంచిదన్న గొట్టిపాటి రవికుమార్.. లేకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధిచెప్తారన్నారు.