TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

  •  TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP) గవర్నర్ పదవిని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయించినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కేంద్ర బిజెపి నడుం బిగించింది. ఇటీవలే టిడిపి, బిజెపి మధ్య మంచి సంబంధాల నేపథ్యంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులో టిడిపి సహకరించడంతో, ప్రతిఫలంగా గవర్నర్ పదవిపై బిజెపి మరోసారి ఆలోచన ప్రారంభించింది. దీనికి సంబంధించి టిడిపికి సంకేతాలు అందగా, ఇప్పటికే ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

TDP టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం ఆ ఇద్దరి లో ఎవరికీ

TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

TDP : టీడీపీ కి చెందిన నేతలకు గవర్నర్ పదవి..?

గవర్నర్ పదవికి టిడిపి నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరూ పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలందించి కీలక పదవుల్లో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్, ఆర్థిక మంత్రి పదవులతో పాటు అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం అధికారంలో టిడిపి ఉన్నప్పటికీ, ఈ ఇద్దరు నేతలకు ప్రత్యక్ష పాలనా పదవులు దక్కలేదు. యనమల ఇటీవలే మండలి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పిన విషయం గుర్తు చేయాలి.

ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే, యనమలకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు నాయుడు త్వరలో ఈ రెండు పేర్లపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపనున్నారు. గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుల్లో గవర్నర్ పదవికి ఎంపికైన వారు కేవలం నలుగురే కావడం గమనార్హం. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది