Hyper aadi తెలంగాణలో జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్న హైపర్ ఆది ..
ప్రధానాంశాలు:
Hyper aadi తెలంగాణలో జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్న హైపర్ ఆది ..
Hyper aadi support to Janasena pawan kalyan
తెలంగాణలో జనసేన పార్టీకి సపోర్టుగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆలోచించే చేస్తారని, ఆయన ఎక్కడ నిలబడ్డ ఎవరిని నిలబెట్టినా వారికి ప్రచారం చేస్తాను అని,
Hyper aadi తెలంగాణలో జనసేన పార్టీకి సపోర్టుగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆలోచించే చేస్తారని, ఆయన ఎక్కడ నిలబడ్డ ఎవరిని నిలబెట్టినా వారికి ప్రచారం చేస్తాను అని, పవన్ కళ్యాణ్ గారు అన్న జనసేన సిద్ధాంతాలు అన్న నాకు చాలా ఇష్టమని, కాబట్టి ఆయన ఎక్కడ పోటీ చేసిన అక్కడ తప్పకుండా ప్రచారం చేస్తానని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నానని, తెలంగాణలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలుపు వచ్చే అవకాశం ఉందని హైపర్ ఆది అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరువేరుగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా జనాదరణ బాగా వచ్చింది. ఇక తెలంగాణలో కూడా జనసేన పార్టీ గెలిస్తే చాలా సంతోషం అని అన్నారు.
తెలంగాణలో కూకట్ పల్లి నియోజకవర్గం చాలా ముఖ్యమైనది. బిజెపితో కలిసి జనసేన కూడా గెలిస్తే ఆంధ్రాలో కూడా ప్రభావం ఉంటుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఆంధ్రాలో టిడిపి జనసేన కలిసాయి. కాబట్టి తెలంగాణలో ఉన్న టీడీపీ ప్రజలు కూడా జనసేనకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కూకట్ పల్లి అభ్యర్థి ముమ్మాడి ప్రేమ్ కుమార్ రెడ్డి ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణలో బిజెపితో కలిసి కొన్నిచోట్ల పోటీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ కూడా సీఎంగా పోటీ చేస్తారు. ఆంధ్రాలో లాగే తెలంగాణలో కూడా మెజారిటీ సీట్లతో జనసేన గెలుస్తుంది అని హైపర్ ఆది అన్నారు.
గత ఎన్నికల్లో కంటే ఈ సారీ ఎన్నికల్లో ఆంధ్రాలో జనసేనకి మంచి సపోర్ట్ ఉంది. టీడీపీ, జనసేన కలిసి మెజారిటీ సీట్లతో గెలిచే అవకాశం ఉంది. ప్రధాని మోడీ, జేడీ నడ్డా కూడా పవన్ కళ్యాణ్ గారు నా వెనక ఉన్నారు అని ప్రచారం చేశారు. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ క్రేజీ చూసి కాదు ఆయన వ్యక్తిత్వం చూసి అని హైపర్ ఆది అన్నారు. ఈమధ్య హార్బర్ లో బోట్లు కాలిపోతే కళ్యాణ్ గారు వెంటనే ఒక్కో బోటు కి 50,000 ఇప్పించారు. ఎవరికైనా ఆపద కలిగిన దేశానికి ఏదైనా జరిగిన వెంటనే స్పందిస్తారు. అందుకే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా తీసుకున్నారు. ఇక నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడిలా కాకుండా జనసేన అధ్యక్షుడిగా సపోర్ట్ చేస్తారు. కూకట్ పల్లిలో ప్రేమ్ కుమార్ నీ గెలిపిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది లోటు పాట్లు అన్ని సరి చేయడానికి బిజెపి , జనసేన ఉమ్మడి అభ్యర్థి కరెక్ట్ అని అన్నారు. ఎందుకంటే వాళ్లు మార్పు కోసమే తప్ప దోచుకోవడానికి కాదు అని హైపర్ ఆది అన్నారు.