Sajjala Ramakrishna Reddy : వెనకబడిన సజ్జల… ఇక జగన్ పక్కన చూడడం కష్టమేనా…!
ప్రధానాంశాలు:
Sajjala Ramakrishna Reddy : వెనకబడిన సజ్జల... ఇక జగన్ పక్కన చూడడం కష్టమేనా...!
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పార్టీలో జగన్ కి అత్యంత సన్నిహితుడు , నమ్మకస్తుడు , శ్రేయోభిలాషిగా పేరు గడించినవారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ పార్టీ తరఫున ఏదైనా విషయంపై మాట్లాడాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ముందుంటారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకు సకల శాఖల మంత్రి అనే పేరు కూడా బిరుదుగా లభించింది. ఎలాంటి సమస్య అయినా సరే సజ్జల ముందుండి మాట్లాడేవారు. దీంతో చాలా సందర్భాలలో వైసీపీ పార్టీ అయిన ప్రభుత్వమైన సజ్జల మాత్రమే అంటూ వార్తలు కూడా వచ్చేవి. అంతెందుకు ఒకానొక సందర్భంలో ఏపీ సీఎం జగనా లేక సజ్జలా అనే పరిస్థితులు కూడా కనిపించాయి. ఈ విధంగా ఎప్పుడు జగన్ కు నీడలా సజ్జల వ్యవహరిస్తూ ఉండేవారు.
అసలు సజ్జల పక్కన లేకుండా జగన్ ఎవరికీ కనిపించేవారు కూడా కాదు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి పై వైసీపీ ప్రభుత్వం పరాజయం పొందిన తర్వాత విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఆయన కారణంగానే పార్టీ ఓటమిపాలైందని వైసీపీ పార్టీ నేతలు గుసగుసలు ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక పార్టీకి జగన్ కి మధ్య సజ్జల ఉంటూ పార్టీ నేతలకు జగన్ కు మధ్య గ్యాప్ సృష్టించారని అంటున్నారు. మరి ఈ ప్రచారాలలో వాస్తవం ఉంది అనుకున్నారో లేక దీని ప్రభావం రానున్న రోజుల్లో పడుతుంది అనుకున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా సజ్జల సీట్ వెనక్కి వెళ్ళిపోయింది.
ఎందుకంటే ఇటీవల జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో సజ్జల సీటు ఏకంగా వెనక్కి వెళ్లిపోయింది. ఈ విధంగా చూస్తే సజ్జల ప్రాముఖ్యత తగ్గిందా లేక కావాలనే ఆయనని దూరంగా ఉంచారా అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో సజ్జల వెనక్కి వెళ్లడం పట్ల సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఆయన సీట్ ఇంకా వెనక్కి వెళ్లి తెర వెనుకకు వెళ్తుందా లేక ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరి సజ్జల సీటు మార్పు అనేది ఈ విధంగా ఎంతకాలం ఉంటుందో వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.