Sajjala Ramakrishna Reddy : సీనియర్స్ వ్యతిరేఖిస్తున్నా సజ్జల పైనే నమ్మకం పెట్టుకున్న జగన్
ప్రధానాంశాలు:
Sajjala Ramakrishna Reddy : సీనియర్స్ వ్యతిరేఖిస్తున్నా సజ్జల పైనే నమ్మకం పెట్టుకున్న జగన్
Sajjala Ramakrishna Reddy : ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ సారి దారుణంగా ఆ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు ప్రక్షాళణ మొదలు పెట్టింది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ప్రక్షాళన కొనసాగుతోంది. కొత్త కమిటీలను ప్రకటించటమే కాకుండా… నియోజకవర్గాల బాధ్యులను కూడా మారుస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇక పార్టీ అనుబంధంగా ఉండే కమిటీలను కూడా పూర్తిస్థాయిలో మారుస్తున్నారు.ఎన్నికల్లో ఓటమి అనంతరం, వైసీపీ అధినేత జగన్ పార్టీ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు జగన్ Ys Jagan ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
Sajjala Ramakrishna Reddy ఎందుకంత నమ్మకం..
సజ్జల గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించడం తెలిసిందే. దాదాపు జగన్ తర్వాత పవర్ హౌస్ సజ్జల అనేంతగా ఆయన హవా నడిచింది. ఇక, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులను కూడా నేడు నియమించారు. జగన్ ఆదేశాలతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్ లను నియమించారు. కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కాగా, బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి జిల్లాకు చెందినవారు. ఎవరు అయితే తమ పార్టీని పాతాళంలో పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారో ఆయన చేతికే పార్టీని అప్పగించేశారు జగన్. ఆయన దగ్గరకు రాకుండా చేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నా జగన్ మాత్రం పట్టించుకోవడంలేదు. తాజాగా ఆయనకే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా పదవి ప్రకటించేశారు.

Sajjala Ramakrishna Reddy : సీనియర్స్ వ్యతిరేఖిస్తున్నా సజ్జల పైనే నమ్మకం పెట్టుకున్న జగన్
ఇంతకు ముందు ఆరుగురు రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. ఇందులో విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి లాంటి ఐదుగురు రెడ్లు, ఒక్క బొత్స ఉన్నారు. వీరందరికి హెడ్డుగా సజ్జల ఉంటారు. అంటే ఈ ఆరేడుగురే మొత్తం పార్టీని నడిపిస్తారు. జగన్ చేసేదేమీ ఉండదు. ఆయనకు ఏ అంశంపైనా పూర్తి అవగాహన ఉండకుండా చేయాల్సిన రాజకీయాలు సజ్జల చేస్తూంటారు. సజ్జల ఏది చెబితే అది చేయాల్సిందే. ఇప్పుడు పార్టీలోనూ అదే పరిస్థితి.సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీలో ఎవరిలోనూ సానుకూలత లేదు. ఆయనకంటూ ఓ ప్రత్యేక వర్గం పార్టీలో ఉంది. చివరికి జగన్ ను కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చూపించే ప్రయారిటీ వేరుగా ఉంటుంది. ఆయనపై పార్టీలో 70 శాతం వ్యతిరేకత ఉంటుంది.ఆయన నీడ జగన్ పై పడకపోతే చారని అనుకుంటూ ఉంటారు.కానీ జగన్ మాత్రం ఆయనను వదల్లేని పరిస్థితుల్లోకి పడిపోయారు.