Ap Election 2024 Survey : ఏపీలో గెలుపు ఎవరిది..? తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ap Election 2024 Survey : ఏపీలో గెలుపు ఎవరిది..? తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే…!

Ap Election 2024 Survey : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కూర్చి ఎవరిని వరిస్తుంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం ఆసక్తికరంగా మారుతుంది. అయితే వై.యస్ జగన్ మాత్రం ఈసారి కూడా అధికారం తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన ఈసారి ఎలాగైనా వైయస్ జగన్ ను ఓడించాలనే […]

 Authored By tech | The Telugu News | Updated on :9 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ap Election 2024 Survey : ఏపీలో గెలుపు ఎవరిది..? తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే...!

Ap Election 2024 Survey : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కూర్చి ఎవరిని వరిస్తుంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం ఆసక్తికరంగా మారుతుంది. అయితే వై.యస్ జగన్ మాత్రం ఈసారి కూడా అధికారం తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన ఈసారి ఎలాగైనా వైయస్ జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజెపీ పార్టీ కూడా కూటమితో కలిసి వస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనే విషయాలను స్పష్టం చేస్తూ తాజాగా సర్వే నిర్వహించడం జరిగింది. ఇక ఈ సర్వే వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరిదో తేల్చి చెప్పింది.

అయితే వచ్చే ఎన్నికల ఫలితాలపై తాజాగా ప్రముఖ సంస్థ అయినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నివేదికను వెల్లడించడం జరిగింది. ఇక ఈ సర్వేలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభిస్తాయనే విషయాలను సర్వే అంచనా వేసి చెప్పింది. అదేవిధంగా మహిళలు పురుషులు వయస్సు ఆధారంగా కూడా వివిధ రకాల అంశాలపై సర్వే చేయడం జరిగింది. అయితే ఈ సర్వేలో అధికార పార్టీ వైసీపీకి స్పష్టమైన ఆధికత్య లభించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఆత్మ సాక్షి గ్రూప్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వైసీపీకి ఈ ఎన్నికల్లో 48% ప్రజల నుండి మద్దతు లభిస్తుండగా, కూటమిగా ఏర్పడిన టిడిపి మరియు జనసేనకు 46.50% ప్రజాదరణ ఉన్నట్లుగా తేల్చి చెప్పింది. ఇక ఇతరుల విషయానికొస్తే 3.25% ఉండగా , సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.25 శాతంగా నిర్ధారించడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీకి 106 నుండి 110 స్థానాలు , టీడీపీ మరియు జనసేన కూటమికి 64 నుండి 68 స్థానాలు వస్తాయని ఈ సర్వే అంచనా వేసి చెప్పింది.

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కూడా సర్వే లెక్కలను స్పష్టం చేసింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5 , కూటమికి 3 , 2 స్థానాలలో కింగ్ కాంటెస్ట్ ఉండనున్నట్లు తెలియజేసింది. అలాగే విజయనగరంలో వైసీపీకి 7 కూటమికి 2 సీట్లు , విశాఖ జిల్లాలో వైసీపీకి 7 , కూటమికి 5 , అలాగే తూర్పుగోదావరిలో వైసీపీకి 10 కూటమికి 7 , పశ్చిమగోదావరిలో వైసీపీకి 7 కూటమికి 4 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా సర్వే ఫలితాలను వెల్లడించింది. అదేవిధంగా కృష్ణాజిల్లాలో వైసీపీకి 6 కూటమికి 5 , మరో 5 స్థానాలలో హోరాహోరీ పోటీ నడుస్తుందని తెలియజేసింది. అదేవిధంగా గుంటూరులో వైసీపీకి 7 కూటమికి 7 మరో 3 స్థానాలు ఇన్ కాంటెస్ట్ ఉండనున్నట్లు చెప్పింది. ప్రకాశం లో వైసీపీకి 5 కూటమి కి 5 మరో రెండు చోట్ల హోరాహోరి పోటీ జరగనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా అనంతపురంలో వైసీపీకి 7 కూటమికి 3 , చిత్తూరు జిల్లాలో వైసీపీకి 9 కూటమికి 4 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈనెల 5వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో చేసిన సర్వే ఆధారంగా ఆత్మసాక్షి సంస్థ ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది