Jagananna Gruha Nirmana Yagnam Scheme : జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం స్కీమ్ కింద అక్కాచెల్లెమ్మలకు ఇళ్లను అందించనున్న సీఎం జగన్
Jagananna Gruha Nirmana Yagnam Scheme : ఏపీలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. నవరత్నాలు మాత్రమే కాదు.. పేదల కోసం చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. తాజాగా జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం అనే స్కీమ్ ను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. అలాగే.. 21.76 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసి పేద అక్కాచెల్లెమ్మలకు అందజేయనున్నారు. వివిధ దశల్లో శరవేగంగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవాళ సామర్లకోటలో అక్కాచెల్లెమ్మలను లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ఇళ్లను అందించనున్నారు.
పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా.. ఎందరికో ఇళ్లు లేని పేదలకు సొంతింటి కలను నిజం చేశారు సీఎం జగన్. సీఎం జగన్ ఇల్లు లేని వాళ్లకు స్థలం ఇస్తున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులను ప్రభుత్వమే ఇస్తోంది. తద్వారా ఇల్లు లేని పేదలు ఎందరికో సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. రాష్ట్రవ్యాపత్గా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్కచెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందజేస్తోంది. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి.
Jagananna Gruha Nirmana Yagnam Scheme : ఒక్కో ఇంటి విలువ సగటున రూ.10 లక్షల వరకు ఉంటుంది
ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతో పాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఇంటి విలువ కనీసం రూ.10 లక్షల వరకు టుంది. కొన్ని ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు కూడా ఇస్తున్నారు. పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టిస్తోంది.