Pawan Kalyan : రివర్స్ ఫైర్ అయిన పవన్ కళ్యాణ్ ఉప్మా స్టోరీ..!
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే టాపిక్. అదే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. అవును.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా నడుస్తోంది. పవన కూడా రెచ్చిపోతున్నారు. ఉత్సాహంతో యాత్రలో పాల్గొంటున్నారు. జనం కూడా ఆయన యాత్రకు భారీగానే వస్తున్నారు. మరోవైపు పొత్తుల వ్యవహారం కూడా ఇంకా ఎటూ తేలలేదు. అధికార వైసీపీని ఓడించడం కోసం పవన్ ఏ పార్టీతో అయినా పొత్తు కూడేందుకు సై అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. ఏపీలో బీజేపీ ప్రభావం అంతగా ఉండదు. అందుకే.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన చూస్తోంది.
అయితే.. టీడీపీతో పొత్తు ఉంటుందని బాహాటంగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ప్రకటించారు. కానీ.. ఇంకా ఆ పొత్తులు కన్ఫమ్ కాలేదు. అంటే.. ఒక్క వైసీపీ పార్టీని ఓడించడం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నారు. ఇక.. తన సభల్లో పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. 70.. 30 సర్కారు అంటూ విమర్శిస్తున్నారు. అంటే.. వంద మంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును.. వైసీపీ ప్రభుత్వం తనకు కావాల్సిన 30 మందికి పంచుతోందట. అలా… ఓటు బ్యాంకును పెంచుకుంటోంది అంటూ పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన ఓ ఉప్మా స్టోరీని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan : ఆ ఉప్మా స్టోరీ ఏంటో తెలుసా?
ఆ ఉప్మా స్టోరీ ఏంటంటే.. ఒక వసతి గృహంలో రోజూ ఉప్మా పెడుతుంటే అందరూ ఎదురు తిరిగారట. ఎందుకంటే.. రోజూ ఉప్మా పెడుతున్నారు. మాకు వద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారట. దీంతో అక్కడ ఓటింగ్ పెట్టారని.. ఎవరికి ఉప్మా కావాలో.. ఎవరికి వద్దో ఓటింగ్ పెడితే.. 18 మంది మాత్రం ఉప్మా కావాలని.. 82 మంది మాత్రం ఉప్మా కాకుండా వేరే టిఫిన్ పేర్లను చెప్పారట. అంటే.. అయితే.. ఉప్మా కావాలని చెప్పిన వాళ్ల సంఖ్యే అందులో ఎక్కువగా ఉండటంతో చివరకు వాళ్లకు మళ్లీ ఉప్మానే గతి అయింది అంటూ పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ కూడా ఉప్మా లాంటి పార్టీనే అని.. వైసీపీ వద్దు అని అనుకుంటున్న వారిలో ఐక్యత ఉండాలి. అందరూ కలిసి కట్టుగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. విపక్షాల్లో ఉండే అనైక్యతే వైసీపీకి బలం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు పవన్. అంటే.. విపక్షాలు అనీ కలిసి కట్టుగా ఉంటేనే వైసీపీని ఇంటికి పంపించవచ్చు అని పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.