Kodali Nani : నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు…షర్మిలకు కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్…!
ప్రధానాంశాలు:
Kodali Nani : నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు...షర్మిలకు కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్...!
Kodali Nani : తాజాగా కొడాలి నాని ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ షర్మిల గురించి సంచల వ్యాఖ్యలుు చేశారు. అంతేకాక మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని మాట్లాడుతూ….2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుండి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో షర్మిల అసలు పాల్గొనడం జరిగిందా. లేకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం నాయకుల కోసం, లేదా కార్యకర్తలపై నాయకులపై తాడులు జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను చంపితే , కార్యకర్తలను చంపినప్పుడు ఆమె ఎక్కడికైనా వచ్చిందా…5 సంవత్సరాల తరువాత మరి 20 రోజుల లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆమె 40 మీటింగ్ చెప్పింది. ఆమె 20 రోజుల్లో 43 మీటింగ్స్ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 150 సీట్లు వచ్చాయి అని కొడాలి నాని అన్నారు.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆమె 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆమె పాదయాత్ర చేసినప్పుడు గెలిపించగలిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. కానీ ఇప్పుడు నేను కష్టపడిన నేను కష్టపడిన అని చెబుతుంది . ఎవరికోసం కష్టపడింది ఆమె. ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడానని , అన్న కోసం కష్టపడ్డానని , నిస్వార్ధంగా కష్టపడ్డానని మాటలు చెబుతుంది. నిజంగా షర్మిల నిస్వార్ధంగా కష్టపడి ఉంటే నాలుగు సంవత్సరాలు తర్వాత మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనంగా వచ్చి స్టీల్ ప్లాంట్లను మోడీ ప్రైవేటీకరన చేస్తున్నాడని అంటుంది. ఏం చేయాలి. నిన్న షర్మిల లేఖల రాసింది .అలాంటి లే ఖలు మేము వంద రాశాం .పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టు.కానీ దానిని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆరోజు షర్మిల ఎమన్నా మాట్లాడిందా. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. మరి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటం లేదు. మీరు పెట్టిన చట్టం ఎందుకు మోడీ అని ఎందుకు అడగటం లేదు. ఏం వాళ్లకి బాధ్యత లేదా. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ కదా వారికి ఏం సంబంధం లేదా. ఈ 10 సంవత్సరాలలో ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లు అడిగిందా..
ఇక మొన్ననేమో ప్రతిపక్ష నాయకులు ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు , తిరిగి వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టావు అని అంటుంది. అవిశ్వాస తీర్మానం అసలు ఎవరు పెట్టారు. ఎంపీలతో ఎవరు రీజైన్ చేపించారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ , దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు అని ఛాలెంజ్ చేశాడు. అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతా, ఇక్కడికి వెళ్లి వేలుతో మాట్లాడుతానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. వారు అలా అన్నారు కాబట్టి మేము అవిశ్వాస తీర్మానం పెట్టినం. మేము పెట్టినమని చంద్రబాబు నాయుడు కూడా పెట్టండి. దీని అంతటికి గల కారణం పవన్ కళ్యాణ్ కదా. ఇవన్నీ ఏం తెలియకుండానే షర్మిల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. కాబట్టి షర్మిల ముందు నువ్వు అన్ని తెలుసుకున్న తర్వాత మాట్లాడు అంటూ కొడాలి నాని షర్మిలపై ఫైర్ అయ్యారు…