Ys Sharmila : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
ఫోన్ ట్యాపింగ్ కేసులో షర్మిల కూడా బాధితురాలే
Ys Sharmila : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
Ys Sharmila : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారం పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించడం తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే తన మొబైల్ సంభాషణలు వింటూ ఆ సమాచారం జగన్‌కు చేరవేశారనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

Ys Sharmila : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..!
Ys Sharmila : నా మాటలన్నీ జగన్ కు చేరవేశారు – షర్మిల
తన ఫోన్ సంభాషణలను ఎవరు వింటున్నారన్న అనుమానంతోనే తాను అనేకసార్లు వ్యక్తిగత ఫోన్ నంబర్లు మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాక తన ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు జగన్‌కు సమాచారం చేరేలా చేయడం వెనుక బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్రధారి ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ట్యాపింగ్ బృందమే ఉందని భావిస్తున్నారు. అంతేకాక తమ మధ్య బంధాన్ని గుర్తించకుండా ఉండేందుకు కోడ్ లాంగ్వేజ్ వాడినట్టు సమాచారం.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావు, ఇతరులు విచారణకు లోనవుతున్న ఈ కేసులో షర్మిల ఆరోపణలతో కేసుకు కొత్త కోణం వచ్చింది. ఒకవేళ ఆమె ఆరోపణలు నిజమైతే, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించిన ఘోరమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. షర్మిలకు మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు ముందుకు రావడంతో, ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే పెద్ద దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి.