Kodi Kathi Srinu : జైలు నుండి బయటకు వచ్చిన 24 గంటల్లోనే జగన్ కు షాక్ ఇచ్చిన కోడి కత్తి శీను..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kodi Kathi Srinu : జైలు నుండి బయటకు వచ్చిన 24 గంటల్లోనే జగన్ కు షాక్ ఇచ్చిన కోడి కత్తి శీను..!

Kodi Kathi Srinu : 2018 అక్టోబర్ 25న జరిగిన ఓ సంఘటన కారణంగా నిన్నటి వరకు కూడా జైల్లో ఉన్నటువంటి కోడి కత్తి శీను బయటికి రావడం ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. అయితే ఇన్నేళ్లుగా కోడి కత్తి శీనుకు బెయిల్ రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని కోడి కత్తి శీను లాయర్ కూడా చెప్పలేకపోయారు. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Kodi Kathi Srinu : జైలు నుండి బయటకు వచ్చిన 24 గంటల్లోనే జగన్ కు షాక్ ఇచ్చిన కోడి కత్తి శీను..!

Kodi Kathi Srinu : 2018 అక్టోబర్ 25న జరిగిన ఓ సంఘటన కారణంగా నిన్నటి వరకు కూడా జైల్లో ఉన్నటువంటి కోడి కత్తి శీను బయటికి రావడం ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. అయితే ఇన్నేళ్లుగా కోడి కత్తి శీనుకు బెయిల్ రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని కోడి కత్తి శీను లాయర్ కూడా చెప్పలేకపోయారు. అయితే నాలుగున్నర సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ముద్దాయిగా జైల్లో ఉంచడం, ఇక ఈ హత్య అతని చేశాడా లేక దీని వెనక ఏమైనా కుట్ర ఉందా అనే విషయాలను NIA తేల్చలేకపోవడం అలాగే NIA కి మద్దతు తెలుపుతూ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం రాజకీయాల్లోని పలు రకాల కుట్రలకు ఇది ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు. అయితే కోడి కత్తి శ్రీనుకు కోర్టు బెల్ మంజూరు చేస్తూ కోర్టు అతనికి ముఖ్యంగా ఒక కండిషన్ పెట్టడండం జరిగింది. అదేంటంటే ఈ కేసు గురించి మీడియాతో పొరపాటున కూడా ఎక్కడ మాట్లాడకూడదని, ఎవరికీ ఈ కేసు గురించి చెప్పకూడదని కండిషన్ పెట్టింది.

అయితే జైల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కోడి కత్తి శీను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తన డిగ్రీను పూర్తి చేశారు. డిగ్రీలో బిఎ పూర్తి చేశాడు.అయితే గత నాలుగేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటున్న కోడి కత్తి శీను జైల్లోనే ఉంటూ చదువుకుంటూ తన డిగ్రీను పూర్తి చేశారు.అయితే మొదట రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కోడి కత్తి శీను ఆ తర్వాత రాజమండ్రి కి కూడా షిఫ్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తితో శ్రీను హత్య చేయడానికి ప్రయత్నించిన వీడియోలు స్పష్టంగా మనం కూడా చూసాం. కోడి కత్తి శీను జగన్ పై హత్య ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటి …ఏమైనా కుట్ర ఉందా అనే విషయాలను తెలుసుకునేందుకు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA తేల్చేటువంటి ప్రయత్నంలో భాగంగా నిమగ్నమై ఉంది అని చెప్పాలి. నిజానికి కోడి కత్తి సీను తప్పు చేసి ఉంటే అతనికి శిక్ష పడాలి.కానీ న్యాయవ్యవస్థలో ఉండేటువంటి లూప్ హోల్స్ ని ప్రజలు నాయకులు ఎలా వాడుకుంటున్నారు అనేదానికి ఈ కేసు ముఖ్య ఉదాహరణ అని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2018 అక్టోబర్ 25న ఈ సంఘటన జరిగింది.

ఇక అప్పుడు కోడి కత్తి శీను కత్తితో జగన్ పై హత్య చేసినప్పుడు మూడు పాయింట్లు పరిగణలోకి తీసుకోవాలి. అతను కావాలని చేశాడా. లేక అతని వెనక ఎవరైనా ఉన్నారా…లేక పొరపాటున చేశాడా ఈ మూడే ఉండాలి. అయితే ఈ చిన్న కేసును ఎంత కాదనుకున్నా రెండు సంవత్సరాల్లో తేల్చేయవచ్చు కానీ గత నాలుగున్న ఏళ్లుగా ఈ కేసు పై ఎలాంటి క్లారిటీ రాలేదంటే కచ్చితంగా జుడిసరి తప్పు ఉందని చెప్పాలి. అలాగే ఈ కేసు పై సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి రాకపోయినా కోర్టు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది ఇలా ఉంటే కోడి కత్తి శీను జైలు నుండి బయటకు వచ్చిన 24 గంటల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇవ్వబోతున్నాడని ప్రచారాలు జరుగుతున్నాయి. అదేంటంటే కోడి కత్తి శీను ఈ కేసుని క్వాష్ చేయమంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాడట. సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ కేసులో ఎలాంటి కుట్రలు లేవని ,నన్ను నిర్దోషిగా పరిగణించి ఈ కేసును క్వాష్ చేయండి అని అడగబోతున్నారు. ఇదే గనక జరిగితే నిజంగా సుప్రీంకోర్టు శ్రీనివాస్ మాటలను కన్సిడర్ చేసి ఈ కేసును క్వాష్ చేస్తే వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కి కచ్చితంగా ఇది షాకింగ్ న్యూస్ అవుతుందని చెప్పాలి.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక