Konda Raghava Reddy : కూతురిలా చూసుకున్న వైవి సుబ్బారెడ్డిని వైఎస్ షర్మిల అలా ఎందుకు అన్నారు ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Konda Raghava Reddy : కూతురిలా చూసుకున్న వైవి సుబ్బారెడ్డిని వైఎస్ షర్మిల అలా ఎందుకు అన్నారు ..??

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,9:00 pm

Konda Raghava Reddy : ఏపీ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక తెలంగాణలో వైయస్సార్ టీపీ పార్టీని పెట్టి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్లో విలీనం చేసి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో వైఎస్ షర్మిల రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు. తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలో చేరి ఆయన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వైయస్సార్ సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి పై కూడా ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై వైయస్సార్ టీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి స్పందించారు.

వైవి సుబ్బారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైయస్ షర్మిలకు ఒక తండ్రి లాగా ఉన్నారు. అలాంటి వైవి సుబ్బారెడ్డి పై కూడా వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని అన్నారు. ఒక తల్లి కడుపులో పుట్టాము అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు కానీ వైయస్ షర్మిల అలా ఆలోచించరు. ఆమెకు ఒక హద్దు లేదు పద్దు లేదు. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు లేవు. ఆమెకు ఓర్వలేనితనం ఎక్కువగా ఉంటుంది. ఈ ఓర్వలేనితనం లాంటి పెద్ద రోగం మరొకటి ఉండదు. కానీ అది వైయస్ షర్మిల కు ఉంది. వైయస్ షర్మిల వైసీపీని గెలిపించడానికి పదేపదే పాదయాత్ర చేశానని రక్తం ధారపోసానని చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా ఆమె రక్తం ధార పోస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిలను పొగడవచ్చు.

కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరు చేశారు. తన తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అనిపించేలా చేసుకున్నారు. 3400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, గల్లి గల్లి తిరిగి ప్రజల మనసులను గెలుచుకున్నారు. వైయస్ షర్మిల ఎవరిని ఉద్ధరించడానికి సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని వలన ఆమెకు ఎటువంటి లాభం ఉండదు. వైయస్ షర్మిల దగ్గర జవాబుకు జవాబు ప్రశ్నకు జవాబు ఉండదు ఆమె ఎందుకు మాట్లాడతారో, ఏం చేస్తారో ఎవరికి తెలియదు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ ఒకటే. తాను క్రైస్తవుడు అని హిందూవులను పట్టించుకోకుండా ఉండరు. ఆయనకు అందరూ సమానం. చంద్రబాబు నాయుడు గుళ్లను కూల్చేస్తే హిందువుగా మారి గుళ్లను నిర్మించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొండా రాఘవ రెడ్డి అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది