Mark Shankar : మార్క్ శంకర్‌ని తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు..!
ప్రధానాంశాలు:
Mark Shankar : మార్క్ శంకర్‌ని తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు
Mark Shankar : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకుని విశాఖపట్నం నుండి సింగపూర్‌కు హుటాహుటిన చేరుకున్నారు.మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖతో కలిసి సింగపూర్‌కు వెళ్లారు.

Mark Shankar : మార్క్ శంకర్‌ని తీసుకొని ఇండియాకి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు
Mark Shankar ఇండియాకి వచ్చేశారు..
సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు మెరుగైన చికిత్స అందించారు. అయితే.. మార్క్ శంకర్‌కు పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, అతడు క్షేమంగానే ఉన్నాడని పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఇరువురూ తెలిపారు. ఈ వార్త అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చింది. చిరంజీవి రీసెంట్‌గా తన ట్వీట్‌లో మార్క్ శంకర్ ఇంటికి వచ్చేసాడని కూడా తెలిపారు.
ఇక మార్క్ శంకర్‌ని తీసుకొని పవన్ కళ్యాణ్ దంపతులు ఇండియాకి తిరిగొచ్చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల పాటు మార్క్ శంకర్ విశ్రాంతి తీసుకుంటే తిరిగి కోలుకుంటాడని చెబుతున్నారు. కాగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తమ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లడం ఆయన తండ్రి ప్రేమను చాటుతోంది.
Mark Shankar is safe and back home now!
pic.twitter.com/eDMgdjpXic— Telugu Chitraalu (@TeluguChitraalu) April 12, 2025