Minister Roja : నా అందం చూడు బావయ్యో అంటూ రోజా డ్యాన్స్ ఇరగదీసింది.. వీడియో
Minister Roja : ఏపీ మంత్రి రోజా తెలుసు కదా. తను ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తోంది రోజా. సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీ అయిపోయిన రోజా.. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. ఏపీకి మంత్రిగా ఉన్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రోజా కళాకారులు డ్యాన్స్ వేస్తుండగా చూసి ఆగలేకపోయారు. వెంటనే స్టేజి మీదికి వెళ్లి తన కళను ప్రదర్శించారు.
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన వేడుకల్లో డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు రోజా. నా అందం చూడు బావయ్యో అంటూ ఆ పాటకు డ్యాన్స్ వేసి రోజా అదరగొట్టేశారు. ఆమె డ్యాన్స్ కు అక్కడున్న వాళ్లు ఫిదా అయిపోయారు. రోజాలో ఇంత మంచి కళాకారిణి ఉందా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం రోజా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Minister Roja : రోజా డ్యాన్స్ వీడియో వైరల్
నా అందం చూడు బావయ్యో అంటూ మరో కళాకారిణితో కలిసి రోజా అద్భుతమైన స్టెప్పులు వేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రోజా సహజంగానే మంచి డ్యాన్సర్. ఏ వేదిక మీదికి వెళ్లినా తను అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అప్పట్లో రోజా హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా హీరోల పక్కన సూపర్బ్ డ్యాన్స్ వేసేది. తన డ్యాన్స్ కళ ఇంకా మరిచిపోలేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా తన కళను మరిచిపోకుండా డ్యాన్స్ వేసి అందరినీ అదరగొట్టిన రోజా డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.