modi : మోడీని విమర్శించే సాహసం ఈ ముగ్గురు చేయడం లేదు.. మరి విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటీ?
modi : దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ దాదాపుగా ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ ఏడు ఏళ్లలో ఆయన సాధించింది ఎంత అంటే చెప్పడం కష్టమే కాని ఆయన దేశ రాజకీయాలను తన గ్రిప్ లో పెట్టుకున్నాడు అనడంలో సందేహం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులను తన గ్రిప్ లో పెట్టుకోవడం కోసం అన్ని మార్గాలను అన్వేషించాడు. తన ముందు ఎవరైనా కాలర్ ఎగరేసినా కాస్త సీరియస్ గా మాట్లాడినా కూడా తాట తీస్తున్నాడు. తన చేతిలో ఉన్న కేంద్ర దర్యాప్తు బృందాలతో వారి అంతు చూసే వరకు వదలడం లేదు అనేది సోషల్ మీడియా టాక్. అందుకే రాష్ట్రాల నాయకులు మోడీని చూసి భయపడుతున్నారు అంటున్నారు. అందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మోడీని డైరెక్ట్‌గా తిట్టే సాహసం చేయడం లేదట.
modi : చంద్రబాబు, జగన్‌లకు కేసుల భయం..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కు కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కొన్ని నెలల ముందే ఈ నిర్ణయం జరిగినా కూడా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇంత పెద్ద విషయం ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా తెలియకుండా ఉండదు. అయినా కూడా వైఎస్ జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఆయన ఎదుర్కొంటున్న కేసులు. ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీ వెళ్లి తనపై ఉన్న కేసును కొట్టి వేసేలా సీబీఐ ని ఆదేశించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారని టాక్. కాని మోడీ అండ్ అమిత్ షాలు ఇలాంటి విషయాల్లో జగన్ లాంటి వారు రిలాక్స్ అయితే తమపై ఎక్కి కూర్చుంటాడు అనే ఉద్దేశ్యంతో కేసును కొట్టి వేయించేందుకు ఓకే చెప్పలేదు అంటున్నారు. ఇక చంద్రబాబు పై కూడా పలు కేసులు ఉన్నాయి. అందుకే మోడీని వీరు డైరెక్ట్‌గా విమర్శించడం మొదలు పెడితే ఆ కేసుల వల్ల జగన్ చంద్రబాబులు జైలుకు వెళ్లాల్సి రావచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
పవన్ ఎందుకు సైలెంట్..
పవన్ కు మొదటి నుండి మోడీ అంటే ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఆ కారణంగానే ఆయన్ను డైరెక్ట్ గా విమర్శించడం లేదు. మోడీ ఏం చేసినా కూడా దూర దృష్టితో చేస్తాడు అనేది పవన్ అభిప్రాయం. వైజాగ్ స్టీల్ విషయమై కూడా మోడీ అదే అభిప్రాయంతో చేసి ఉంటాడు అని పవన్ భావిస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే విశాఖ స్టీల్ విషయంలో మోడీని పవన్ విమర్శంచడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు కూడా మోడీని ఎదిరించే ధైర్యం లేకనో లేదా ఆయనతో ఢీ కొట్టడం ఎందుకులే అనుకుని లైట్ తీసుకుంటున్నారు. దాంతో వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏంటో అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.