Nagababu : తెలంగాణను డెవలప్ చేసిన కేసీఆర్ నే ఓడించారు .. ఆఫ్ట్రాల్ నువ్వెంత .. జగన్ పై నాగబాబు కామెంట్స్..!!
ప్రధానాంశాలు:
Nagababu : తెలంగాణను డెవలప్ చేసిన కేసీఆర్ నే ఓడించారు ..
ఆఫ్ట్రాల్ నువ్వెంత .. జగన్ పై నాగబాబు కామెంట్స్..!!
Nagababu : తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరో ఉత్కంఠమైన పోరుకు రంగం సిద్ధమైంది. మరో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జరగనుంది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈసారి రసవత్తరమైన పోరు జరగనుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎన్నికల్లో నిలబడగా మరోవైపు తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పార్టీ కార్యక్రమంలో ప్రస్తావించాడు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ….వేదికపై ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా పీసీసీ చైర్మన్ మనోహర్ గారికి, ఈ రోజే పార్టీలో జాయిన్ అయిన సుందరపు వెంకట సతీష్ గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అని తెలియజేశారు. ఇక 2019లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.
వారి తండ్రిగారి యొక్క ఆదరణ జగన్ కు కలిసి వచ్చాయి. కానీ అదే 2019లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ తెలియజేశాడు.ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో పూర్తిగా వ్యతిరేకతను పొందిన జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారం నుండి తప్పుకోక తప్పదని, కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నారంటూ నాగబాబు తెలియజేశాడు. అంతెందుకు ఎంతో సర్వీసులను అందించి, తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వంటి వారిని ప్రజలు చిన్న పొరపాటుతో గద్ద దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారు. ఆయన ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ప్రజల అవసరాలను తెలుసుకోకుండా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి .
ఈసారి ఆఖరికి ఓ సామాన్యుడు చిన్న స్థలంలో ఇల్లు కట్టుకుందాం అన్న, ఏదైనా వ్యాపారం చేసుకుందామన్న ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ప్రతి వ్యక్తిని పీడిస్తున్నటువంటి వైసిపి ప్రభుత్వం ప్రజలలో ఇంత వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రభుత్వం 2024 లో దారుణంగా ఓడిపోతుందంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఆ మార్పు కచ్చితంగా ఏర్పడుతుందని జనసేన, టీడీపీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. అయితే ఇప్పటివరకు మనం వైసీపీ ప్రభుత్వం చూసాం. టీడీపీ ప్రభుత్వం చూసాం. ఇక ఇప్పుడు టిడిపి మరియు జనసేన అలయన్స్ ప్రభుత్వాన్ని కచ్చితంగా చూస్తారు అంటూ తెలియజేశాడు. ఇది కచ్చితంగా అద్భుతమైన పరిపాలన అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.