
Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?
Nagababu : ఏపీలో ఇప్పుడు కూటమి రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీ TDP , జనసేన Janasena పొత్తులు పెట్టుకున్నాయి. అయితే జగన్ Ys jagan ను ఎదుర్కోవాలంటే ఈ బలం సరిపోదనుకున్నారేమో.. వెంటనే బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుసుకుని కూటమిగా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు మూడు పార్టీల మధ్య సయోధ్య కుదరక నానా రచ్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దాంతో పాటు అటు బీజేపీ BJP నేతలు కూడా తమకు ఓడిపోయే చోట్ల సీట్లు ఇచ్చారంటూ రగిలిపోతున్నారు. ఇటు జనసేన కూడా అంతే.
తమకు గౌరవ ప్రదమైన సీట్లు ఇవ్వలేదని జనసైనికులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నాగబాబు నిప్పులు ఉప్పేస్తున్నారు. ఆయన ఈ నడుమ చేసే ట్వీట్లు వ్యంగ్యంగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీని ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేస్తున్నట్టే ఉంటున్నాయి. ఆ మధ్య టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. పవన్ Pawan kalyan కూడా రెండు సీట్లు ప్రకటించుకున్నారు. ఆ సమయంలో నాగబాబు ఓ ట్వీటేశాడు. టీడీపీని దెబ్బకు దెబ్బ తీశామని చెప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో ట్వీటేశాడు. ఇది నేరుగా చంద్రబాబుకు తగిలే విధంగానే ఉంది.
Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?
ఆయన తాజాగా ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశాడు. ‘ వయసు ఎక్కువ, పెద్ద వాడు అని ప్రతి వెధవను గౌరవించనక్కరలేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్ కోట్ ను నాగబాబు పోస్టు చేశారు. ఈ మాటలు చంద్రబాబును ఉద్దేశించే చేశాడంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఎందుకంటే ఈ నడుమ జనసేనకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నాడంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల అది కచ్చితంగా చంద్రబాబును ఉద్దేశించే చేశాడని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. దాంతో ఇప్పుడు రెండు పార్టీల నడుమ చిచ్చు మరోసారి రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.