kalvakuntla kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ రన్ కు వెళ్లాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ నేతలు అయినంత మాత్రాన ఈ కేసును విచారంచలేమని.. చట్టం అందరికీ ఒకటే అని.. ప్రస్తుతం ఈ కేసు విచారణ చేయడ కుదరదని తేల్చేసింది కోర్టు. చట్టం అందరికీ సమానమే కాబట్టి ఈ కేసు విచారణ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకే వెళ్లాలని కవిత తరపు న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది.
అంతే కాకుండా మహిళ కాబట్టి కేసు విచారణలో జాప్యం చేయొద్దని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా పిటిషన్ లో లేవనెత్తిన అంశాలపై విచారించేందుకు కోర్టు అంగీకిరంచింది. ఇందుకోసం ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది. 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రిట్ పిటిషన్ లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారిస్తాం. కానీ కవిత మాత్రం ట్రయల్ రన్ ఎదుర్కోవాల్సిందే అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆమెను ఈడీ అధికారులు నేరుగా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా.. 7 రోజుల కస్టడీ విధించింది. అంతే కాకుండా ఈడీ కస్టడీకి కూడా అనుమతిచ్చింది. దాంతో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంతే కాకుండా తనను ఈడీ అధికారులు అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పిటిషన్ లో తెలిపింది. కాగా రేపు ఆమెను కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. ఈ కేసులో ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి ఆమెను బెయిల్ మీద విడుదల చేయించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
This website uses cookies.