Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?
ప్రధానాంశాలు:
2029 ఎన్నికల్లో కూడా జనసేన శ్రేణులకు నిరాశేనా..?
నారా లోకేష్ సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడా..?
Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పటికీ, ఇప్పుడు లుకలుకలు మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిపత్యం పెరిగిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సొంతంగా ఒక ఇమేజ్ ను సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పవన్ కల్యాణ్‌ను పక్కన పెట్టాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?
Nara Lokesh 2029 ఎలక్షన్ల కోసం ఇప్పటి నుండే లోకేష్ పునాది వేస్తున్నాడా..?
ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా, రైజ్ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లట ఒక ట్వీట్ చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారని, అందుకోసం ఆయన తన సొంత బృందాన్ని రంగంలోకి దించారని ఆ ట్వీట్ సారాంశం. ఇప్పటికే లోకేష్ తన టీమ్‌ను ఏర్పాటు చేసుకుని, పలు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారని పుల్లట పేర్కొన్నారు. రాబోయే రెండు సంవత్సరాలు ఏపీ రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయని, పెను మార్పులు సంభవిస్తాయని ఆయన అంచనా వేశారు. ఈ పరిణామాలు గనుక నిజమైతే, టీడీపీ కూటమిలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిణామంపై కూటమి భాగస్వామ్య పార్టీ అయిన జనసేన ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం అంటే, పవన్ కల్యాణ్‌ను దాదాపుగా పక్కన పెట్టడమే అవుతుంది. పవన్ కల్యాణ్, జనసేన నాయకులు, కార్యకర్తలు దీనికి అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ గతంలో టీడీపీ కూటమి 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అభ్యర్థికి కూడా వర్తిస్తాయా అనే విషయంలో ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.