Peddi Reddy : పెద్దిరెడ్డిని సీఎం,డిప్యూటీ సీఎం, మాజీ సీఎం టార్గెట్ చేశారుగా.. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు..!
Peddi Reddy : నలబై ఏళ్లు రాజకీయాలలో ఉన్నారు. వైసీపీలో చక్రం తిప్పారు. రాజకీయంగా ప్రత్యర్ధులని తొక్కేసేలా పావులు కదిపారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఫిక్స్ చేసిన టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట. సీఎం చంద్రబాబుతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కుటుంబానికి రాజకీయంగా బద్ధ శత్రువైన ఆ నేతను తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా టార్గెట్ చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాకు చెందిన పెద్దిరెడ్డికి…. చంద్రబాబుతో విద్యార్థి దశ నుంచే రాజకీయంగా వైరం ఉంది. కానీ, ఎప్పుడూ పెద్దిరెడ్డిని టచ్ చేయని చంద్రబాబు.. తొలిసారి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
Peddi Reddy పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి..
ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్‌తో సహా 12 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పెద్దిరెడ్డిని షాక్ కు గురిచేసింది. పెద్దిరెడ్డిపై రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైచేయి సాధించగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కూడా పెద్దిరెడ్డిపై ఆరోపణలను నిగ్గు తేల్చే పనిని సీరియస్ గా తీసుకున్నారు. అటవీశాఖ సమీక్ష సమావేశంలో చిత్తూరు జిల్లా నుంచి అక్రమంగా తరలించిన ఎర్రచందనం నేపాల్ భద్రతా బలగాలు సీజ్ చేయడం పవన్ దృష్టికి వచ్చింది. ఈ అక్రమ దందాలో పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న డిప్యూటీ సీఎం… ఆధారాలు సేకరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అయితే పెద్దిరెడ్డి తరహా రాజకీయాలకు భిన్నంగా మిథున్ రెడ్డి రిక్వెస్ట్ మోడ్ లో ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం, డిప్యూటీ సీఎంకి తోడు అన్నట్లు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతోపాటు కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ పెద్దిరెడ్డికి రాజకీయంగా వైరం ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ అండతో ప్రభుత్వం నుంచి రక్షణ పొందాలని పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే… బీజేపీలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకుంటున్నారంటున్నారు. మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతుందని ఓ టాక్ వినిపిస్తుంది.