Roja : వైసీపీ వర్సెస్ వైసీపీ… నగరిలో పట్టు సాధిస్తున్న రోజా..!
Roja : సినీనటి, ఎమ్మెల్యే రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి అందరికీ విదితమే. వైసీపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడం లేదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తానే నియోజకవర్గంలో అల్టిమేట్ లీడర్ అని మరోసారి నిరూపించుకుంది.నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండల పరిషత్ అధ్యక్ష పదవిని తన వర్గానికి ఇప్పించుకోవడంలో రోజా చక్రం తిప్పింది. దాంతో రోజా ప్రత్యర్థి వర్గం అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు ఈ క్రమంలో షాక్ తగిలినంత పని అయింది.
మండల పరిషత్ ఎన్నికల్లో నిండ్ర మండలలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మండలానికి అధ్యక్షుడిగా శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి ఎన్నిక కావాలనుకున్నారు. కానీ, నగరి ఎమ్మెల్యే రోజా ఇందుకు ఒప్పుకోలేదు. ఆయన కాకుండా దీప అనే ఎంపీటీసీని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా రోజా ఖరారు చేసింది. దీంతో ఈ విషయమై పెద్దిరెడ్డి వర్గీయులు అంగీకరించలేదు. నిండ్ర మండలంలో పట్టు తమదే కాబట్టి తామే మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)గా ఉంటామన్నారు. ఎమ్మెల్యే రోజా మాటలను లెక్కలోకి తీసుకోకూడదని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
Roja : నిండ్ర ఎంపీపీగా రోజా ఖరారు చేసిన ఎంపీటీసీ..
దాంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా వైసీపీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. ఇక హై కమాండ్ ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిండ్ర మండలంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడైన చక్రపాణిరెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. కాగా, ఎమ్మెల్యే రోజాకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ దక్కించుకోవాలని ఆయన అనుకుంంటున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నానరు. అయితే వారు బలపడకుండా రోజా హైకమాండ్ దగ్గరి నుంచి పనులు చక్కబెట్టుకుని వస్తున్నది. మొత్తంగా ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటున్నది.