Hospital : మనుషుల్లో మానవత్వం కోల్పోయిందా..? నడవలేను అని చెప్పినా వీల్ చైర్ ఆసుపత్రి సిబ్బంది..!
ప్రధానాంశాలు:
Hospital : మనుషుల్లో మానవత్వం కోల్పోయిందా..? నడవలేను అని చెప్పినా వీల్ చైర్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది..!
Hospital : ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక దృశ్యం ప్రస్తుతం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తికి పాదం తొలగించబడింది. తాను నడవలేనని, చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు చక్రాల కుర్చీ (వీల్ చైర్ ) కోసం వేడుకున్నాడు. కానీ అక్కడ ఉన్న సిబ్బంది కనికరించకుండా అతన్ని నిర్లక్ష్యంగా తోసిపుచ్చారు.

Hospital : మనుషుల్లో మానవత్వం కోల్పోయిందా..? నడవలేను అని చెప్పినా వీల్ చైర్ ఆసుపత్రి సిబ్బంది..!
Hospital : మరీ ఇంత దారుణమా..
బాధితుడు నేలపై కూర్చుని చేతులు జోడించి వేడుకుంటుంటే, ఒక భద్రతా సిబ్బంది ఖాళీగా ఉన్న చక్రాల కుర్చీని తీసుకెళ్తూ అతనికి ముఖం కూడా చూపకుండా “ఇది నీకు కాదులే” అని నిర్లక్ష్యంగా చెప్పాడు. అదే సమయంలో అతను ఫోనులో మాట్లాడుతూనే తన పనిలో నిమగ్నమయ్యాడు.చేసేదేమీ లేకపోయిన ఆ బాధితుడు, చివరికి చేతులనే కాళ్లుగా మలుచుకుని ఆసుపత్రి గదుల వైపు అడుగులు వేసాడు. ఈ దృశ్యం కొందరిని కన్నీటి పర్యంతం చేయగా, మరికొందరిని ఆగ్రహానికి గురిచేసింది.
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. “మనుషుల్లో మానవత్వం కోల్పోయిందా?”, “రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంత అసహాయం నిండిపోయిందా?” అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల స్పందన ఇంకా రాకపోయినా, స్థానికులు ఆసుపత్రి సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.