Thagubothula Sangam : తాగి కాల‌వ‌లో ప‌డిపోతే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thagubothula Sangam : తాగి కాల‌వ‌లో ప‌డిపోతే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Thagubothula Sangam : తాగి కాల‌వ‌లో ప‌డిపోతే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..!

Thagubothula Sangam : మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ ఇటీవ‌ల తెగ హాట్ టాపిక్ అయ్యారు. ఆయ‌న రీసెంట్‌గా మద్యం ప్రియుల బాధ‌లు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆయన చేసిన ప్ర‌యత్నం 24 గంట‌ల‌లోనే ఫ‌లించ‌డం విశేషం . మంచిర్యాల జిల్లా‌వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్లు, బార్లలో కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.ఈ క్ర‌మంలో మందు బాబుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక త‌మ బీర్ల దాహం తీర్చార‌ని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ను శాలువా క‌ప్పి స‌న్మానించారు తాగుబోతులు .

Thagubothula Sangam : డిమాండ్స్ ఇవే..

అనంతరం త‌రుణ్ మాట్లాడుతూ.. తాగుబోతుల డిమాండ్లను వినిపించారు. ఎక్కడైతే తాగుబోతులు అనారోగ్యంపాలై ఆసుపత్రులకు వెళ్తారో.. వాళ్లకి తాగుబోతు అని తెలవగానే 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తాగుబోతులను మానసిక వికలాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారికి నెలకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాల‌ని తెలియ‌జేశారు. తాగి నడుచుకుంటూ వెళ్తుంటే కిందపడి కాళ్లు చేతులు విరిగినట్లయితే వారికి ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని.. ఒకవేళ వాహనం నడుపుతూ చనిపోయినట్లయితే బాధిత కుటుంబానికి 5 లక్షలు సాయం అందించాలంటూ కూడా ఆయ‌న డిమాండ్‌లో తెలియ‌జేశారు.

Thagubothula Sangam తాగి కాల‌వ‌లో ప‌డిపోతే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్

Thagubothula Sangam : తాగి కాల‌వ‌లో ప‌డిపోతే ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..!

తాగుబోతులు వాళ్ల ఆరోగ్యాన్ని, ఆస్తులను ప్రభుత్వానికి దారబోస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు కాబ‌ట్టి వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం 5 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందించాల‌ని కూడా త‌రుణ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంతో వీరితో చర్చలు జరపాలని, తమ న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చాలని కోరనున్నట్టుగా కొట్రంగి తరుణ్ పేర్కొన్నారు. కాగా, త‌రుణ్ రీసెంట్‌గా మంచిర్యాలలోని పలు వైన్ షాపుసు, బార్లను సందర్శించి కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరుకుతున్న విష‌యం తెలుసుకొని సంతోషించాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది