Ys jagan అటు తిరిగి ఇటు తిరిగి – వైఎస్ జగన్ కి బంగారం లాంటి శుభవార్త చెప్పిన నిమ్మగడ్డ ?
Ys jagan : ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒక వైపు దేవాలయాలపై దాడులు మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌డ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం ఓకే చెప్పడం లేదు. దాంతో కోర్టుల ఉట్టు ఈ విషయం తిరుగుతుంది. మరో వైపు ఏపీలో జరుగుతున్న దేవాలయాల దాడులు మాత్రం మీడియాలో పెద్దగా ప్రచారం జరగడం లేదు. ఏపీలో దేవలయాల రాజకీయం వల్ల వైఎస్ జగన్ కిందా మీద అయ్యాడు. ఆ రెండు రోజులు ఏం చేయాల్రో బాబోయ్ అంటూ వైఎస్ జగన్ జుట్టు పీక్కున్నాడు. అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌డ ద్వారా వైఎస్ జగన్ కు మంచి జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైకాపాకు లాభమే. అయితే ఇప్పుడు మీడియాలో ఈ విషయం రచ్చ కొనసాగుతున్న కారణంగా దేవాలయాల ఇష్యూ మరుగున పడిపోవడం జనాలు మర్చి పోవడం చేస్తున్నారు.
ఇలా వైఎస్ జగన్ రిలాక్స్.. Ys jagan
దేవాలయాల దాడుల సమయంలో వైఎస్ జగన్ పై ఏ రేంజ్ లో ఒత్తిడి పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయంగా వైఎస్ జగన్ కావాలని దాడులు చేయిస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వైఎస్ జగన్ తీరుపై విమర్శలు చేసింది. అలాంటి సమయంలో Nimmagadda ramesh kumar ఎన్నికల విషయం తో దేవాలయాలకు సంబంధించిన విషయం మరుగున పడ్డట్లయ్యింది. దాంతో వైఎస్ జగన్ రిలాక్స్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు మరియు నిమ్మగడ్డ రమేష్ లు తమకు తెలియకుండానే వైఎస్ జగన్ కు మంచి చేసినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇక దేవాలయాల ఇష్యూ లేనట్లే.. వైఎస్ జగన్
ఒక వైపు దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో వైపు వాటి సెక్యూరిటీ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని వైఎస్ జగన్ అంటున్నాడు. వేలాది దేవాలయాలను సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకు వచ్చారు. దాంతో ఎక్కడ దాడి జరిగినా కూడా వెంటనే తెలిసి పోతుంది. దాంతో ఆ విషయమై ఎలాంటి ఆందోళన లేదు. ఇక దేవాలయాలపై దాడులు మర్చి పోయేలా గో పూజ మరియు కొత్త దేవాలయాలను నిర్మించడం వంటివి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలతో పార్టీకి హిందువుల మద్దతు పెరిగింది. కనుక ఇకపై దేవాలయాల ఇష్యూ లేనట్లే. దీనికి అంతటికి కారణం నిమ్మగడ్డతో ఉన్న వివాదాలు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.