Nandamuri Harikrishna : హరికృష్ణ గురించి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ నరసయ్య బయటపెట్టిన నిజాలు ..!
ప్రధానాంశాలు:
Nandamuri Harikrishna : హరికృష్ణ గురించి ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ నరసయ్య బయటపెట్టిన నిజాలు ..!
Nandamuri Harikrishna : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన నర్సయ్య ఓ ఇంటర్వ్యూలో నందమూరి ఫ్యామిలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కొడుకులను హరికృష్ణ చాలా సింపుల్ గా ఉండేవారని, సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఉన్నప్పుడు చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ ఉన్నారని, అతను తోటి మనుషులతో చాలా కలివిడిగా ఉండేవారని, ఎన్టీఆర్ కొడుకని కొంచెం కూడా అహంకారం ఉండేది కాదని, నిజమైన డ్రైవర్ లాగే బండి కింద పట్టా వేసుకుని పడుకునే వారని, డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేసేవాడని కానీ దురదృష్టం ఆయన సొంతంగా డ్రైవింగ్ చేస్తూ మరణించడం అందరికీ బాధాకరం అని ఆయన అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ఎన్నికల ముందు చిత్తూరు జిల్లాలో ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే అండర్ ట్రాక్ కింద చైతన్య రథాన్ని నడిపిస్తున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి గాయం తగిలింది. ఆ సమయంలో హరికృష్ణ నా వల్లే గాయం తగిలిందని ఏడ్చారు. ఇక ఎన్టీఆర్ తలకు గుడ్డ కట్టుకొని ప్రసంగించేందుకు సభకు వెళ్లారు. అక్కడ చిత్తూరు టౌన్ కు ఝాన్సీ లక్ష్మీ అనే ఆవిడ పోటీ చేస్తుంది. అయితే ఎన్టీఆర్ తలకు గాయం ఉండడంతో జనం అంతా ఎన్టీఆర్ మీద రాళ్ళేసారని అనుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఇలా కాదు అలా జరిగిందని చెప్పారు. ఇక ఎన్టీఆర్ స్పీచ్ లో నరాలు ఒత్తిడి అయ్యేలా మాట్లాడుతారు.
దాంతో ఆయన ప్రసంగించేటప్పుడు తలకు రక్తం కారటం మొదలైంది. ప్రసంగించవద్దు అని చెప్పిన ఎన్టీఆర్ వినలేదు. మొండి స్వభావం కలిగిన ఎన్టీఆర్ హరికృష్ణ చెప్పిన వినలేదు. దీంతో మేమంతా ఝాన్సీ లక్ష్మి కు ఎన్టీఆర్ ను మాట్లాడవద్దని చెప్పాం. ఆ తర్వాత బలవంతంగా ఎన్టీఆర్ ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. హాస్పటల్ కెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాం. తలకు పెద్దగా గాయం తగలకపోవడంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం అని అన్నారు. ఇక టీడీపీని లక్ష్మీపార్వతి నుంచి చంద్రబాబు రెండుసార్లు కాపాడారు అని నరసయ్య అన్నారు. ఇక టీడీపీకి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ లేదా మరి ఎవరైనా రావచ్చు. ఇది రాచరికం కాదు రాజకీయం. ఎన్టీఆర్ సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. లోకేష్ మంత్రిగా ఎమ్మెల్సీగా చేశారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే నాయకులు అవుతారు అని అన్నారు.