Tirupati Laddu : లడ్డూ ఇష్యూలో జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న పవన్, చంద్రబాబు..!
ప్రధానాంశాలు:
Tirupati Laddu : లడ్డూ ఇష్యూలో జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న పవన్, చంద్రబాబు
Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్ సారథ్యపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు ల్యాబ్ టెస్టుల నిర్థారణలతో వెల్లడించారు. దీనితో దేశంలో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. ఈ విషయంపై త్వరలోనే సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశిస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. మాజీ సిఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా భోపాల్‌లో హిందూ మత సంస్థలు నిరసన ప్రదర్శనలకు దిగాయి.పలువురు కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ ఈ విషయంలో దొంగలు ఎవరైనా వదిలేది లేదన్నారు.
Tirupati Laddu జగన్‌పై ఫైర్..
వారిని ఉరితీయాల్సిందే అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే వారు జైలు పాలు కావల్సిందే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ ఈ విషయంపై సిబిఐ దర్యాప్తు అత్యవసరం అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూపై స్పందిస్తూ..హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. దేవుడా క్షమించు.. అంటూ కోరుతూ ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా సంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. 11 రోజుల పాటు ఈ దీక్ష స్వీకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. వైసీపీ హయాంలో రథాలను సైతం తగలబెట్టారని ఆలయాలను అపవిత్రం చేశారని భగ్గుమన్నారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే కూడా పోరాడినట్లు చెప్పారు. అయితే.. తమకు ఏ మతము అయినా ఒకటేనని.. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతామని చెప్పుకొచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం అయిందని భావించిన చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయం మొత్తం శుద్ధి చేయాలని ఆదేశించారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని లోతుగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. మార్కెట్లో 600 కిలో అమ్ముడవుతున్న నెయ్యి.. తిరుమలకు కేవలం రూ.320లకే ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌తో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలోనూ తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు