Tirupati Laddu : తిరుమల లడ్డూలో పొగాకు పొట్లం.. అందరిలో అనేక సందేహాలు..!
Tirupati Laddu : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మనం చూశాం. లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి కలిసినట్లు ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఇదే సమయంలో లడ్డూలో పొగాకు పొట్లం కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.తిరుమలలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం రావడం కలకలం రేపుతోంది. […]
ప్రధానాంశాలు:
Tirupati Laddu : తిరుమల లడ్డూలో పొగాకు పొట్లం.. అందరిలో అనేక సందేహాలు..!
Tirupati Laddu : గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం మనం చూశాం. లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి కలిసినట్లు ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఇదే సమయంలో లడ్డూలో పొగాకు పొట్లం కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.తిరుమలలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం రావడం కలకలం రేపుతోంది. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది.
Tirupati Laddu ఏం జరుగుతుంది..
శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో భక్తురాలు ఆగ్రహం చేస్తున్నారు.: పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం లో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలలోని లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని ఆయన పేర్కొన్నారు.లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని, ఇంతటి పకడ్బందీగా లడ్డులు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. తిరుమలలో దోషం పోవడానికి మహా శాంతి యాగం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని.. ఏ గ్రేడ్ క్వాలిటీ ముడి పదార్థాలతోనే తిరుమల ప్రసాదం తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలకు ఆస్కారం లేదని.. అలాంటి కార్యక్రమం ఎవరు నిర్వహించినా ఉపేక్షించేది లేదన్నారు. త్వరలోనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేస్తామని.. 27 వేల ఆలయాలకు పాలకమండళ్ల నియామకాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాణిపాకం, శ్రీ కాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం అప్పన్న ఆలయాలలో మహా శాంతి యాగం నిర్వహణ చేపట్టామన్నారు.