Pawan kalyan : మంత్రి రోజా పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!
ప్రధానాంశాలు:
Pawan kalyan : మంత్రి రోజా పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!
Pawan kalyan : ఎవరు ఎన్ని విమర్శలు చేసిన వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలని అది ఒక నాయకుడి లక్షణం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు చేసే విమర్శలను కూడా ఎదుర్కోవాలి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై అన్యాయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వైయస్ జగన్ అధికారంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఇక టీడీపీ తో పొత్తుపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిత్ర ధర్మ పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడానికి తప్పు పట్టారు. పోటిగా రెండు స్థానాలలో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. అరకు , మండపేటలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలని కానీ టీడీపీ అది విస్మరించి ఏకంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పు బట్టారు.
రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. కొన్ని ప్రత్యేక కారణాలతోనే నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నట్లే తనకు పార్టీలోకి ఒత్తిడి ఉందన్నారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని జనసేన నుంచి బలం ఇచ్చే వాళ్ళ అవుతున్నాం గానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నామన్నారు. ఒక మాట అంటున్నా కలిసే వెళ్తున్నామన్నారు. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగిందన్నారు. దీనిపై తనను అడిగిన పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. తనకు తెలియనిది కాదని ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి గాని అధికారంలోకి వస్తామోరామో తెలియదన్నారు. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని కొందరు అంటున్నారని, తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తానన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం విడదీయడం తేలిక. అందుకే తనకు నిర్మించడం ఇష్టం అన్నారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసు అన్నారు.
2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేశాం. గత ఎన్నికల్లో పది లక్షల ఓటు సంపాదించామన్నారు. వైఎస్ జగన్ అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడం తో పాటు జనసేన ని కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మిగిలిన వాళ్ళను వదులుతారన్నారు. వైఎస్ జగన్ కు ఊరంతా శత్రువులే. వైయస్సార్ సీపీ నేతలకు కష్టం వస్తే తన దగ్గరకు రావాలన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని సీనియర్ నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి అన్నారు. అనుకోకుండా కొన్ని జరుగుతాయి వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పొత్తులో ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలో రాకూడదని వైఎస్ జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.