Pawan Kalyan : నన్ను చంపడానికి రౌడీ గ్యాంగులకు సుపారీ ఇచ్చారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Published on: June 18, 2023, 3:00 pm

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఉభయగోదావరి జిల్లాలలో సాగుతున్న ఈ యాత్రలో వైసీపీనీ టార్గెట్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్తగా వచ్చే ఎన్నికలలో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తనకి ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కోసం ప్రత్యేకంగా సూపరీ గ్యాంగులను దింపినట్లు సమాచారం ఉందని కాబట్టి నాయకులు జనసైనికులు ఇంకా వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని అదే తన టార్గెట్ అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పాలకులను గద్దె దింపటం గ్యారెంటీ కాబట్టి వారు ఎంతకైనా తెగించే అవకాశం ఉందని తెలిపారు. తనను ఎంతగా భయపడితే తాను అంతగా రాటుదెలుతానాని స్పష్టం చేయడం జరిగింది. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది మన పార్టీకి చెందిన జనసైనికులపై ఇంకా వేరే మహిళలపై దాడి చేయటం జరిగింది.

pawan Kalyan comments on YCP

pawan Kalyan comments on YCP

ఆ సమయంలో నేను ఉండాల్సింది బలమైన కార్యాచరణ లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాను సినీ నటుడిని కావటం వల్ల అభిమానులు తాకిడి తనను అడ్డుకుంటుంది లేదంటే మరింత బలమైన నాయకుడిగా జనంలోకి వెళ్లి ఉండేవాడిని అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp