Pawan Kalyan : ఎంపీగా బరిలో పవన్ కళ్యాణ్… ? ఈ మాస్ట‌ర్ ప్లాన్ వెనుక ఎవ‌రున్నారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ఎంపీగా బరిలో పవన్ కళ్యాణ్… ? ఈ మాస్ట‌ర్ ప్లాన్ వెనుక ఎవ‌రున్నారు..?

Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈసారి ఎలాగైనా వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దేదించాలి అనే ప్రణాళికతో టీడీపీ మరియు జనసేన కూటమిగా కలిసి ముందుకు వెళుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా బరిలో దిగబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ఈసారి పవన్ కళ్యాణ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ఎంపీగా బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్... చంద్రబాబు మాస్టర్ ప్లాన్..?

Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈసారి ఎలాగైనా వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని గద్దేదించాలి అనే ప్రణాళికతో టీడీపీ మరియు జనసేన కూటమిగా కలిసి ముందుకు వెళుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా బరిలో దిగబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ఈసారి పవన్ కళ్యాణ్ రెండు సీట్లకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు ఎమ్మెల్యే సీట్లకు కాదు దానిలో ఒకటి ఎమ్మెల్యే మరియు రెండవది ఎంపీ సీట్లు అని తెలుస్తోంది. ఈ విధంగా రెండు సీట్లకు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వలన 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తును తిరుగులేనిదిగా మలుచుకోవాలనే పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా అడుగులు వేస్తున్నారట.

అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసి గెలిచినట్లయితే అదేవిధంగా మూడోసారి బీజెపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కచ్చితంగా కేంద్రంలో మంత్రి అవుతారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లయితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి అధికారం సాధించగలిగితే దానిలో అతి ముఖ్య భూమికను పవన్ కళ్యాణ్ పోషించగలుగుతారు.ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా సరే ఎంపీగా గెలిస్తే మాత్రం కేంద్రంలో మంత్రిగా ఉండటం వలన తన పార్టీ అధికారం కోల్పోకుండా ఉంటుంది. అయితే ఈ సలహా పవన్ కళ్యాణ్ కు ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం అని సమాచారం. పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం కోరిందట. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీ తో కలిసి కూటమిగా ముందుకు వెళుతున్న ఈ కీలక సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోతే ఆయనను అభిమానించే వారు చాలామంది కూటమి గెలుపులో ఉత్సాహంగా పాల్గొనలేక పోతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.

అయితే టీడీపీ జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో అత్యధికంగా సీట్లను గెలిపించుకొని వారి మంత్రులకు పదవులు దక్కించుకొని తాను ఎంపీగా గెలిచి మంత్రి కావాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తీవ్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న క్రమంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు చాలా మంది పుకార్లు గానే పరిగణిస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేయబోతున్నారని వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కచ్చితంగా అది ఒక మాస్టర్ ప్లాన్ అవుతుందని అర్థం అవుతుంది. దీనివలన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక స్టాండ్ లభిస్తుందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది కూడా ఒక వ్యూహాత్మకంగా పరిగణించబడుతుంది. చూడాలి మరి ఈ ప్రచారాలు ఎంతవరకు నిజమవుతాయో.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది