Pawan Kalyan : ఎమ్మెల్యే , ఎంపీ రెండు స్థానాలకు పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : ఎమ్మెల్యే , ఎంపీ రెండు స్థానాలకు పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీగా పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఎమ్మెల్యే తో పాటు ఎంపీగా పోటీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవిని తీసుకునే యోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే రెండింటికి పోటీ చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేదానిపై తర్జనభజన పడుతున్నారంట. అయితే ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనే అంశం అయితే బయటికి రాలేదని సమాచారం. పార్టీ అందిస్తున్న సమాచారం ప్రకారం ఒకటి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా లేదా అసెంబ్లీ కే పరిమితం అవుతారా అనే చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొల్పింది.
రెండింటిలోనూ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా పార్టీలో జరుగుతున్నాయి. ఎన్నికలలో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక ఎంపీ స్థానానికి ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై గత కొంతకాలం నుంచి పార్టీలో చర్చలు జరుగుతున్నాయంట. అయితే ఇదంతా ప్రచారంగానే ఉంది తప్ప పార్టీ వైపు నుంచి గాని ఇకపోతే పార్టీకి సంబంధించిన నేతల గురించి అధికారికంగా ఎటువంటి ధృవీకరణ కాలేదు. సుచారంగా నిద్దరించే వ్యవహారం కూడా కాదు అయితే ఇదంతా ప్రచారం మాత్రమే అని జనసేన పార్టీ చెబుతున్న పరిస్థితి జరుగుతున్న పరిణామాలు అక్కడ జరుగుతున్న వ్యవహారాలు అన్నీ చూస్తే అంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు అని సమాచారం.
ఇక ఎంపీగా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఎమ్మెల్యేగా పిఠాపురం లేదా భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎక్కడ నుంచి చేయాలి ఆల్రెడీ మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసాని పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అనకాపల్లి కాకినాడ ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఒకవేళ ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే కనుక తప్పుడు సంకేతాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఫీల్డ్ ని వదిలేసి కేంద్రం వైఫై చూస్తారు. అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున వైసీపీ వచ్చే అవకాశం ఉంటుంది.