Pawan Kalyan : నా పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టి నా ఆస్తులు అమ్మేస్తున్న.. పవన్ కళ్యాణ్…!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : నా పిల్లల భవిష్యత్తు పక్కన పెట్టి నా ఆస్తులు అమ్మేస్తున్న.. పవన్ కళ్యాణ్...!
Pawan Kalyan : ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ వైసీపీ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల మన్ననలను పొందుతూ వస్తోంది. అదేవిధంగా అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేసి జగన్ ముందంజలో ఉండగా తాజాగా మొదటి జాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమి కూడా జెండా పేరుతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ఈ భారీ జెండా బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార పార్టీ అధినేత వై.యస్ జగన్ సిద్ధం సిద్ధం అంటూ చావగొడుతున్నాడు. వచ్చే 2024 ఎన్నికల్లో సిద్ధమంటున్న జగన్ కు మనం యుద్ధం చూపిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో యువతను మోసం చేశారని , అదేవిధంగా రైతంగాన్ని కూడా మోసం చేశాడని , ఆంధ్ర రాష్ట్ర మహిళలని మోసం చేశాడని , ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడని, అంగన్వాడి కార్యకర్తలను మోసం చేశాడని , ఇలా అందరినీ మోసం చేసిన వై.యస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పే సమయం వచ్చిందంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
2014లో తాను పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఈరోజు వరకు తాను చేసిన ప్రతి పని కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అని జెండా సభలో పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవని, వ్యక్తి పరంగా ఉండవని , రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఉంటాయని ,దేశ ప్రయోజనాల పరంగా ఉంటాయని తెలియజేశారు. అంతేకానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వ్యక్తిగత లాభాలను ఆశించి రాజకీయం చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మాత్రమే తాను రాజకీయం చేశానని తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చంద్రబాబుతో కలిసి పొత్తు పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో ఎప్పుడూ కూడా ఒక వ్యతిరేకత ఉంటుంది. సహకారం మరియు సంఘర్షణ ఈ రెండూ కూడా పక్క పక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. సహకారం అందించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.
తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు సహకరించుకుని ముందుకు వెళ్తేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు , భవిష్యత్తు బంగారంలా ఉంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందుకే జెండా సభ ద్వారా మన ,సహకారాలను అర్థం అయ్యేవిధంగా చెప్పేందుకు ఈ సభలు నిర్వహించినట్లుగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని , రోడ్స్ సరిగా లేవని అందుకే మేము హెలికాప్టర్ లో రావాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు నేను తీయబోతున్న ఓజి సినిమా నుండి వచ్చే మొత్తం కూడా హెలికాప్టర్ కి పెడుతున్నాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.