Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చిరంజీవి స‌తీమ‌ణి అరుదైన గిఫ్ట్.. ఖ‌రీదు మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చిరంజీవి స‌తీమ‌ణి అరుదైన గిఫ్ట్.. ఖ‌రీదు మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే…!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రిగా స‌రికొత్త బాధ్య‌త‌ని నిర్వ‌ర్తించ‌బోతున్నాడు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాస్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విపక్షనేతగా సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పాలకుడిగా తనదైన ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కూట‌మి విజ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య భూమిక పోషించ‌గా, ఆయ‌నకి ద‌క్కిన ఈ గౌర‌వం ప‌ట్ల కుటుంబ స‌భ్యులు,అభిమానులు, పార్టీ వ‌ర్గాలు చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2024,2:49 pm

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రిగా స‌రికొత్త బాధ్య‌త‌ని నిర్వ‌ర్తించ‌బోతున్నాడు. రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాస్తా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. విపక్షనేతగా సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పాలకుడిగా తనదైన ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కూట‌మి విజ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య భూమిక పోషించ‌గా, ఆయ‌నకి ద‌క్కిన ఈ గౌర‌వం ప‌ట్ల కుటుంబ స‌భ్యులు,అభిమానులు, పార్టీ వ‌ర్గాలు చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తన సోదరుడు చిరంజీవి కుటుంబాన్ని కలిశారు.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన పవన్‌ కళ్యాణ్‌.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్‌లో పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Pawan Kalyan ప్రేమ‌తో గిఫ్ట్..

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్‌.. తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. కొణిదెల కుటుంబానికి పెద్ద కోడలిగా వచ్చే సమయానికి పవన్ చిన్న పిల్లాడు కావడంతో తన బిడ్డల్లాగే పెంచారు సురేఖ. తన వదినపై అభిమానాన్ని , అప్యాయతను ఎన్నో వేదికల మీద వెల్లిబుచ్చేవారు. చిరంజీవి సైతం పవన్‌ను తమ్ముడిలా కాకుండా పెద్ద కొడుకులా చూసుకుంటారు.తన కళ్ల ముందు పెరిగిన పవన్ కళ్యాణ్ గురించి సురేఖ తల్లి లాంటి బాధ్యతను నిర్వర్తించారు. పవన్ సినీ పరిశ్రమ వైపు రావడం వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. పవన్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంట్లోనే గడిపేవాడు. ఎప్పుడు చూసినా తనదైన లోకంలో రిజర్వ్‌డ్‌గా ఇంట్లోనే ఉండేవాడట.వదినమ్మకు చేదోడు వాదోడుగా తలలో నాలుకలో ఉండేవారు పవన్ .

Pawan Kalyan ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చిరంజీవి స‌తీమ‌ణి అరుదైన గిఫ్ట్ ఖ‌రీదు మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చిరంజీవి స‌తీమ‌ణి అరుదైన గిఫ్ట్.. ఖ‌రీదు మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే…!

ఆయనకు ఇష్టమైన వంటకాలు , అభిరుచులు, మనస్తత్వం సురేఖకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదంటారు సన్నిహితులు. తన ఎన్నికల అఫిడవిట్‌లోనూ వదిన సురేఖ గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఆమె వద్ద రూ.2 కోట్లు అప్పులు తీసుకున్నానని తెలిపారు. తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో.. సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్‌ జేబులో పెట్టారు. అది చూసి పవన్‌ తెగ సంతోషపడ్డారు. సురేఖ.. పవన్‌కు ఇచ్చిన మోంట్‌ బ్లాంక్‌ డిస్నీ ఎడిషన్‌ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.3.60 లక్షల వరకు ఉంటుంది అని తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది