Pawan Kalyan – Gudivada Amarnath : అరెయ్ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్.. ఈసారి నీ గుడ్డు పగిలిపోద్దిరా.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ అదుర్స్
Pawan Kalyan – Gudivada Amarnath : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎవరికి దమ్కీ ఇవ్వాలో తెలిసిన వ్యక్తి. చాలా రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఎక్కు పెట్టి మరీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అసలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఇంతలా వైసీపీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం లేదు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని మామూలుగా తిట్టడం లేదు. ఒకసారి అయితే ఏకంగా చెప్పు తీసుకొని కొడుతా అని బెదిరించారు. ప్రస్తుతం ఆయన వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఉత్తారంధ్రలో ఆయన వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో ఆయన వారాహి యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో సాగుతోంది. అక్కడ తన యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వంతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది మామూలుగా కాదు. బీభత్సమైన వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అసలు ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయా? ఇండస్ట్రీలు తెచ్చారా? పోరంబోకు భూములను మొత్తం ఆక్రమించేసుకుంటున్నారు అధికార పార్టీ నేతలు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
Pawan Kalyan – Gudivada Amarnath : అమర్నాథ్ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన పవన్
ఆ భూములను వైసీపీ నేతలు తీసుకున్నారని నిరూపిస్తే.. ఆ భూములు మొత్తం జనసేనకే ఇచ్చేస్తాం అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జనసేనకు భూములేవీ అవసరం లేదు. అడ్డగోలుగా దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే హక్కు ప్రభుత్వానికి లేదా? అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది మరిచి వైసీపీ నేతలకే అప్పనంగా ఇచ్చేస్తే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.