Minister Amarnath : వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి అమర్‌నాథ్ ఔట్..!
ప్రధానాంశాలు:
Minister Amarnath : వైయస్ జగన్ గెలుపు కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా... మంత్రి అమర్నాథ్
Minister Amarnath : ఆంధ్ర రాష్టంలో వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ఎన్నికల బరి నుంచి పోటీకి నిలబడడం లేదు. ఈ విషయం పై తాజాగా సభలో అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినేత జగన్ ఇక పై పూర్తిస్థాయిలో అమర్నాథ్ పార్టీకి సేవలు అందిస్తారని తేలియజేసారు. ఇక అమర్నాథ్ స్థానంలో అనకాపల్లి నుంచి భరత్ ను గెలిపించాలని సీఎం జగన్ కోరుతున్నారు. ఇక అమర్నాథ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన వై.ఎస్ జగన్ అతనిని గుండెల్లో పెట్టి చూసుకుంటానని సభాముఖంగా తెలియజేశారు.అయితే ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని అన్నారు గుడివాడ అమర్నాథ్.జగన్ మరోసారి సీఎం కావడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు కాదని అర్జునుడు అని తెలియజేసారు. జగన్ ను సీఎం చేయడానికి తాను పోటీ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధం అని అమర్నాథ్ ఈ సందర్భంగా తెలియజేసారు.
అర్జునుడికి మేము అందరం తోడుగా ఉంటామని , జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తామని , జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఏ రకమైనటువంటి తడబాటు గాని ఏ రకమైనటువంటి ఇబ్బందిగాని లేకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు.అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నా గురించి చెప్పాల్సిన అవసరం లేదని అమర్నాథ్ తెలియజేసారు. ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళితే సర్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ మంత్రి అమర్నాథ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు…? ఎంపీగా వెళ్తారా..? ఎమ్మెల్యేగా వెళ్తారా..? పొలిటికల్ ప్రచారాలకు వై.యస్ ఆర్ పార్టీ తెర దించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలను పూర్తిస్థాయిలో పార్టీ వినియోగించుకోవాలని చెప్పింది. అయితే ఇవాళ జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
మంత్రి సేవలు పూర్తిస్థాయిలో పార్టీకి అవసరమవుతాయి కాబట్టి వారి సేవలను ఉపయోగించుకుంటూనే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న అనకాపల్లి సీట్ ను మనసాల భరత్ కు కేటాయించారు. అతనిని ఆశీర్వదించమని వేలాదిమంది ప్రజల ముందు కోరారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా కీలకమైనది కాబ్బటి పార్టీ గెలుపుకు పూర్తిస్థాయిలో బలమైన నాయకత్వం ఉండాలి. కాబట్టి అమర్ ను పార్టీ అవసరాల కోసం వినియోగించుకుంటాం అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.అదే విషయాన్ని మంత్రి కూడా కన్ఫర్మ్ చేస్తూ పోటీలో ఉండాలా లేదా అనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది కాబట్టి సీఎం జగన్ ని ముఖ్యమంత్రిగా చూడడం కోసం తాను ఏ త్యాగానికైనా సిద్ధమని తెలపడం జరిగింది. దానితో పాటు పూర్తిగా తన సేవలను పార్టీకి అందిస్తారని కన్ఫామ్ చేశారు. ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలను అమర్నాథ్ కు అప్పగిస్తూ ప్రకటన చేశారు.