Pawan Kalyan : అందుకే నాదేండ్ల మనోహర్ పై మాట పడనివ్వను పవన్ కీలక వ్యాఖ్యలు..!!
Pawan Kalyan : ఇటీవల తెనాలి జనసేన పార్టీ క్యాడర్ తో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. పైగా తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గ కావడంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో నాదెండ్ల మనోహర్ చాలా బలమైన నేత అని తాను బలంగా నమ్ముతానని పవన్ స్పష్టం చేశారు. కచ్చితంగా ఇటువంటి వ్యక్తి చట్టసభలలో ఉండాలని ఈసారి ఎలాగైనా.. మనం గెలిపించుకోవాలని తెనాలి క్యాడర్ కి చెప్పుకొచ్చారు.
దీంతో జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టత వచ్చింది. పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత లేకపోయినా గాని నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీంతో ఒక్క మీటింగ్ తో కాకుండా ఇంకా చాలామందితో తెనాలి జనసేన విభాగానికి చెందిన వారితో సమావేశం అవుతానని పవన్ మాట ఇచ్చారు. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థ పై చాలా అధ్యయనం చేసిన తర్వాతే విమర్శలు చేసినట్లు స్పష్టత ఇచ్చారు. ఈ సేవ కేంద్రాలు చేసిన పనే వాలంటీర్ల వ్యవస్థ చేస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా సమాంతర వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఈ విధానం వల్ల ఉద్యోగాలు తీసేసి తక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని ఇది సమాజానికి అంత మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఒకపక్క మున్సిపాలిటీకి టాక్స్ కడుతూ ఉండగానే మరోపక్క చెత్త టాక్స్ కలెక్ట్ చేయడం అన్యాయమని దీనిని ప్రశ్నించాలంటే అందరూ భయపడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాలలో చట్టసభలలో ప్రభుత్వాలను నిలదీసే సామర్థ్యం నాదెండ్ల మనోహర్ కి ఉందని వచ్చే ఎన్నికలలో ఆయనను అందరు గెలిపించుకోవాలని తెనాలి నియోజకవర్గ జనసేన కేడర్ కి పవన్ సూచన చేశారు.