Pawan Kalyan : జనసేన ప్రభుత్వం వస్తే… అంటూ తన గొయ్యి తానే తవ్వుకున్న పవన్ కళ్యాణ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : జనసేన ప్రభుత్వం వస్తే… అంటూ తన గొయ్యి తానే తవ్వుకున్న పవన్ కళ్యాణ్ !

 Authored By kranthi | The Telugu News | Updated on :28 June 2023,4:00 pm

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎవరిని అడిగినా.. ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే. దాని గురించే అందరి చర్చ. నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఓవైపు టీడీపీ యువనేత నారా లోకేశ్ బాబు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వారాహి యాత్ర పేరుతో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ప్రసంగించినా.. సీఎం జగన్ జపమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జగన్ ను ఇంటికి పంపిస్తేనే రాష్ట్రానికి విముక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. ఏపీలో ఒక్క వైసీపీ పార్టీని ఇంటికి పంపించేందుకు పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అని ప్రకటించారు.

అయినా.. ఇప్పటికే జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. అలాగే.. టీడీపీతోనూ పొత్తు పెట్టుకునేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా.. మూడు పార్టీలు కలిసి.. అధికార వైసీపీని ఓడించడమే ధ్యేయంగా భవిష్యత్తులో పనిచేసే అవకాశం ఉంది. దానిపై పవన్ కూడా చాలాసార్లు మాట్లాడారు.ఒకప్పుడు పొత్తుల గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడటమే మానేశారు. దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషించుకుంటే.. వారాహి యాత్రకు వస్తున్న ఆదరణ అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఆదరణ బాగా లభిస్తోంది. వారాహి యాత్రను చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

Pawan kalyan

Pawan kalyan

Pawan Kalyan : ప్రస్తుతం పొత్తుల విషయం మరిచిపోయిన పవన్

ఒకరకంగా చెప్పాలంటే వారాహి యాత్ర సూపర్ హిట్ అనే చెప్పుకోవాలి. దీంతో పవన్ కళ్యాణ్ ఇక జనసేన పార్టీ గురించి తప్పితే మరో పార్టీ గురించి మాట్లాడటం లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. ఒంటరిగా పోటీ చేసి గెలిచినా.. లేక పొత్తులతో గెలిచినా అధికారంలోకి రాగానే జనసేన ప్రభుత్వం ఏం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఏం హామీలు నెరవేరుస్తామో కూడా చెప్పలేనప్పుడు ప్రజలు అసలు జనసేనను ఎందకు గెలిపిస్తారు. ఈ చిన్న లాజిక్ ను పవన్ ఎలా మరిచిపోయారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది