Pawan Kalyan : పవన్ కళ్యాన్ కి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు ?
Pawan Kalyan : తెలుగు రాజకీయాలలో చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడని చాలామంది సమకాలీకులు సీనియర్ నేతలు అంటుంటారు. టీడీపీ ప్రత్యర్థుల సైతం చంద్రబాబు.. సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు అని ఇప్పటికీ కూడా కామెంట్లు చేస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు.. పవన్ కి పొడిచినట్లు సరికొత్త వార్త ఏపీ రాజకీయాల్లో విడిపిస్తుంది. విషయంలోకి వెళ్తే ఇటీవల పవన్ వాలంటీర్ల వ్యవస్థపై సంచలన కామెంట్లు చేయడం జరిగింది. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని ఈ విషయం తనకు కేంద్ర నిగవర్గాలు తెలియజేసినట్లు వారాహి యాత్రలో వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మరియు వాలంటీర్లు తగలబెట్టారు.
ఇదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల మిత్రపక్షం బీజేపీ నుండి మద్దతు వస్తున్నా గానీ తెలుగుదేశం నుండి ఎవరు కూడా సమర్ధించడం లేదు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునే రీతిలో… అందరూ వాలంటీర్లు కాదు ఎవరో కొంతమంది చేశారు అన్న విధంగా మరుసటి రోజు వ్యాఖ్యానించారు. అయితే మొత్తం ఈ వాలంటీర్ల గొడవ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించింది తెలుగుదేశం పార్టీ అని..అంటున్నారు. అయితే వాలంటీర్లపై వ్యాఖ్యలు మిస్ ఫైర్ కావడంతోపాటు పవన్ ఇమేజ్ డామేజ్ చేసే విధంగా పరిస్థితులు మారడంతో చంద్రబాబు సైలెంట్ అయినట్లు టాక్. ఒక విధంగా చెప్పాలంటే జగన్ పై పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వెనకుండి ఏగదొస్తున్నట్లు.. అజ్ఞానంతో కూడిన కామెంట్స్ కలిగిన స్క్రిప్ట్ ఇస్తున్నట్లు టాక్.
దినంతటికీ ప్రధాన కారణం జగన్ కి ప్రత్యామ్నాయం తన కొడుకు లోకేష్ ని చేయడానికి.. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి సినిమా హీరో ఇమేజ్ ఉండటంతో దాని దెబ్బతీయాలంటే.. బేస్ లెస్ ఆరోపణలు అతనితో చేయిస్తే ప్రజలలో అతను చులకన అవుతాడని.. దీంతో లోకేష్ గ్రాఫ్ పెరుగుతుందనే టాక్ నడుస్తోంది. అదేవిధంగా పవన్ ఎప్పుడూ కూడా ఓ మాట మీద నిలబడే వ్యక్తి కాదని అందువల్ల ఈ రకమైన స్క్రిప్టులు చదివించి ప్రజలలో పవన్ ఇమేజ్ డామేజ్ ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల పర్యవసనానికి తెలుగుదేశం పార్టీ నేతలు సైలెంట్ కావటం అని చాలామంది అంటున్నారు.