తణుకు సభలో వచ్చే ఎన్నికలలో పరోక్షంగా జనసేన అభ్యర్థి ప్రకటించేసిన పవన్..!!
రెండో దశ వారాహి విజయ యాత్ర చివరి బహిరంగ సభ నిన్న తణుకులో జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అక్కడి పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావుకు తన స్పీచ్ ప్రారంభించక ముందు పబ్లిక్ గా ప్రజల సమక్షంలో క్షమాపణలు తెలియజేశారు. విషయంలోకి వెళ్తే గత ఎన్నికల సమయంలో విడివాడ రామచందర్రావు పార్టీ కోసం నిలబడిన పవన్ వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఆ టికెట్ కేటాయించిన వ్యక్తి పార్టీ విడిచి వెళ్ళిపోయారు.
కానీ టికెట్ ఇవ్వకపోయినా గానీ తణుకులో జనసేన పార్టీకి బలంగా నిలబడిన రామచందర్రావు నిజమైన నాయకుడు అని కొనియాడుతూ.. గత ఎన్నికలలో టికెట్ ఇవ్వనందుకు తనను క్షమించాలని ఈసారి మాత్రం తణుకులో ఎగరాలని పవన్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో పరోక్షంగా పవన్ తణుకు జనసేన పార్టీ టికెట్ విడివాడ రామచంద్రరావుకు కేటాయించినట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. పబ్లిక్ మీటింగ్ లో మాత్రమే కాకుండా అంతకుముందు తణుకులో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో సైతం క్షమాపణలు తెలియజేశారు.
పార్టీ పట్ల నిబధత్తతో.. పనిచేసిన విడివాడ రామచంద్రరావుని వచ్చే ఎన్నికలలో గెలిపించుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా విడువాడ రామచంద్రరావు తణుకులో పోటీ చేయబోతున్నట్లు పవన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పసుపులేటి రామారావు జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. వాస్తవానికి ఇక్కడ పార్టీ అభివృద్ధికి విడివాడ రామచంద్రరావు ఎంతగానో కృషిచేశారు. పార్టీ టిక్కెట్ ను ఆశించారు. కానీ చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన పసుపులేటి రామారావు తన్నుకుపోయారు. కానీ ఇక్కడ 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా కారుమూరి నాగేశ్వరరావు 2000 ఓట్లకు పైగా స్వల్ప మెజారిటీతో గెలిచారు.