Pothina Mahesh : పోతిన మహేష్‌కి జగన్ ఈ ఆఫర్ ఇవ్వడంతోనే జనసేన నుండి వైసీపీకి జంప్ అయ్యాడా..!
ప్రధానాంశాలు:
Pothina Mahesh : పోతిన మహేష్‌కి జగన్ ఈ ఆఫర్ ఇవ్వడంతోనే జనసేన నుండి వైసీపీకి జంప్ అయ్యాడా..!
Pothina Mahesh : ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్ది జంపింగ్‌లు ఎక్కువ అవుతున్నాయి. ఒక పార్టీ నుండి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. రీసెంట్‌గా జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. చేరిన వెంటనే .. పవన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించిన దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తిగా ఉన్న పోతిన.. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో జనసేనకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనంటూ స్ట్రాంగ్ కామెంట్స్ కూడా చేశారు పోతిన మహేష్. అయితే విజయవాడ పశ్చిమం నుంచి సీటు ఆశించి భంగపడిన జనసేన నేత పోతిన మహేష్ రీసెంట్‌గా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
Pothina Mahesh : పోతినకి క్రేజీ ఆఫర్..
పొత్తులో భాగంగా పశ్చిమం సీటు బీజేపీకి దక్కగా అక్కడ బీజేపీ అభ్యర్దిగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమం లో నగరాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లతో పాటుగా ముస్తిం మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉండడంతో పశ్చిమం నుంచి వైసీపీ ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించింది.అయితే గతంలో టీడీపీ, బీజేపీ అక్కడ గెలిచింది లేదు. అయిన కూడా పోతిన మహేష్‌ని ఉపయోగించి సుజనా చౌదరిని ఓడించే ప్లాన్ లో జగన్ సర్కార్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.సుజనా చౌదరిని ఓడించే విషయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో పోతిన ఉపయోగపడితే ఆయనకు ఫ్యూచర్‌లో మంచి స్థానం ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది.
వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్దిగా కేశినేని నాని..టీడీపీ అభ్యర్దిగా కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. ఇక, విజయవాడ పార్లమెంట్ పరధిలో మరి కొందరు నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయవాడ తూర్పు జనసేన ఇంఛార్జ్ రాము వైసీపీలో చేరగా, ఇప్పుడు పోతిన చేరికతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రానున్న రోజులలో పోతిన గేమ్ ఛేంజర్‌గా మారనున్నాడని , ఆయనకి మంచి గిఫ్ట్ కూడా అందిస్తారనే టాక్ అయితే ఉంది.