RK Roja : అధికారం ఉందని ఎగిరెగిరిపడే వాళ్లను ఎగరేసి తంతాం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో !
ప్రధానాంశాలు:
మీరు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో సహా తిరిగి ఇస్తాం - రోజా
జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన రోజా
RK Roja : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ పర్యటనల్లో ఆయనకు తగిన భద్రత కల్పించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘జెడ్ ప్లస్’ భద్రత కల్పిస్తున్నామని కోర్టులో చెప్పి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు ముప్పు వాటిల్లేలా కుట్రలు చేస్తోందన్న అనుమానాలు తమకు వస్తున్నాయని అన్నారు.

RK Roja : అధికారం ఉందని ఎగిరెగిరిపడే వాళ్లను ఎగరేసి తంతాం అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో !
RK Roja : వైసీపీని భూస్థాపితం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది – రోజా
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెడతారంటూ మండిపడ్డారు. జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతున్న అధికారులను గుర్తించి వారి వివరాలను నమోదు చేయడం కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నామని ప్రకటించారు. వైఎస్ జగన్ భద్రత అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలకు వైసీపీ గురించి చూస్తేనే భయమేస్తోందని, అందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిలను ఇరికించడమూ అందులో భాగమేనని ఆరోపించారు. “ఇప్పుడైతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి పడుతున్నారు. కానీ మేం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చట్టబద్ధంగా ప్రతీకారం తీర్చుకుంటాం” అని స్పష్టం చేశారు.
ఎగిరెగిరిపడే వాళ్లను ఎగరేసి తంతాం: మాజీ మంత్రి రోజా
ప్రశాంత్ రెడ్డి విషయంలో కేసులు నమోదు చేస్తున్నారు.. మరి నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు
తండ్రి పేరుతో అధికారంలోకి వచ్చిన భాను ప్రకాష్ తో లోకేష్ నా మీద మాట్లాడిస్తున్నారు
– రోజా pic.twitter.com/CkRGf9jYtJ
— BIG TV Breaking News (@bigtvtelugu) July 29, 2025