RK Roja : సీఎం రేవంత్ రెడ్డి పాలన పై సెటైరికల్ కామెంట్స్ చేసిన రోజా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RK Roja : సీఎం రేవంత్ రెడ్డి పాలన పై సెటైరికల్ కామెంట్స్ చేసిన రోజా..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja : సీఎం రేవంత్ రెడ్డి పాలన పై సెటైరికల్ కామెంట్స్ చేసిన రోజా..!

RK Roja : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి మినిస్టర్ రోజా , ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా కళాకారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఆ తర్వాత కళాకారులతో కలిసి డప్పు వాయించారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారని ఆమె అన్నారు. పొరుగు రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. యువత చదువులో రాణించాలని పేద విద్యార్థులకు అండగా జగనన్న నిలిచారు అని, పక్క రాష్ట్రాల వారిని ఇలాంటి పథకాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోండి అని రోజా అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని రోజా మండిపడ్డారు. గుర్తింపు కార్డులు లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల డేటా తీసుకున్నారు కానీ వాటి వలన ఎలాంటి న్యాయం జరగలేదని ఆరోపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కళాకారుల కోసం తాపత్రయపడతారని, కళాకారులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆయన కళాకారిణి అయిన తనకు మంత్రి పదవి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించి వాళ్లకు ధైర్యంగా కార్డుల ప్రధాన ఉత్సవం చేయగలుగుతున్నామని రోజా పేర్కొన్నారు.

సాంస్కృతిక సంబరాలు గుర్తింపు పొందిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని, మట్టిలో మాణిక్యంలా ఉన్న మారుమూలన ఉన్న కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. గతంలో కళాకారులను ఎవరు పట్టించుకోలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కళాకారులను పట్టించుకున్నారని రోజా పేర్కొన్నారు. కళాకారులు కూడా ఆ విషయాన్ని గుర్తించాలి అని రోజా పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో దొంగలు దొంగలు ఏకమై పందుల్లా గుంపుగా వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దొంగలకు పందులకు బుద్ధి చెప్పేందుకు కళాకారుల ఆట పాట మాట కావాలని రోజా కోరారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ రోజా నినాదం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది