RK Roja : డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ పవన్ కళ్యాణ్ రోజా చిందులు..!
ప్రధానాంశాలు:
RK Roja : డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ పవన్ కళ్యాణ్ రోజా చిందులు..!
RK Roja : వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, జనసేన నేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించకుండా మౌనంగా పవన్ ఉండడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. “సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘటనలపై ఎందుకు నోరు విప్పడంలేదు?” అని ప్రశ్నించారు. పదవులు, ప్యాకేజీలు ఇచ్చేసరికి నోరు మూసుకుంటావా అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

RK Roja : డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ పవన్ కళ్యాణ్ రోజా చిందులు..!
RK Roja : సనాతన ధర్మాన్ని కాపడతానని చెప్పుకున్న వ్యక్తి.. ఇది కనిపించడం లేదా..? – రోజా
చంద్రబాబును రక్షించేందుకు పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని రోజా ఖండిస్తూ “దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం సరికాదు. గోవులు చనిపోతుంటే సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే నీకు బాధ ఎందుకు లేదీ?” అని ప్రశ్నించారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ పై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని , తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి నిజాలు మాట్లాడిన వారిపై దాడి చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులకు పవన్ కూడా భాగస్వామే, అందుకే తిరుమల మెట్లన్నీ కడగాలి..ఇదే పవన్ చేసే ప్రాయశ్చిత్తం అంటూ రోజా డిమాండ్ చేసారు.