Roja : పవన్, పురంధేశ్వరిలని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!
Roja : తిరుమల లడ్డూ వ్యవహారంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం, అదంతా అబద్ధం అని జగన్ కొట్టి పారేయడం మనం చూశాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించడంతో వైసీపీ నేతలు సాయిరెడ్డి, రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. పురందేశ్వరి బావ కళ్లల్లో ఆనందం […]
ప్రధానాంశాలు:
Roja : పవన్, పురంధేశ్వరిలని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!
Roja : తిరుమల లడ్డూ వ్యవహారంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం, అదంతా అబద్ధం అని జగన్ కొట్టి పారేయడం మనం చూశాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పైన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించడంతో వైసీపీ నేతలు సాయిరెడ్డి, రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. పురందేశ్వరి బావ కళ్లల్లో ఆనందం కోసమే కోర్టుల ను తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పురందేశ్వరి బీజేపీ,టీడీపీలో ఏ పార్టీకి అధ్యక్షురాలని రోజా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మండి మనోభావాలు దెబ్బ తిన్నాయని రోజా మండిపడ్డారు.
Roja రోజా ఫైర్..
మరోవైపు పవన్ కళ్యాణ్‌ని కూడా టార్గెట్ చేస్తూ రోజా కామెంట్ చేసింది. ఇది సినిమా షూటింగ్ కాదని..పవన్ కుటుంబ సభ్యులు గతంలో దేవుడి మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను గుర్తు చేసారు. టీటీడీ ఈవోను లడ్డూ విషయంలో విచారించాలని డిమాండ్ చేసారు. విచారణ చేసి తప్పు జరిగి ఉంటే చేసిన వాళ్లను..లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడిన వారిని శిక్షించాలని కోరారు. పవన్ రోజుకో వేషం.. రోజుకో మాట సరికాదన్నారు. పవన్ చేసిన తప్పులకు భగవంతుడు ఆయనతోనే ప్రాయశ్చిత్త దీక్ష చేయిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరద్దం.. కోర్ట్ ధిక్కారంగా రోజా పేర్కొంది. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని విజయ సాయిరెడ్డితో పాటు రోజా కూడా డిమాండు చేశారు.అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి గాను ఇప్పుడు చాలా మందిలో ఆగ్రహావేశాలు వెల్లవెత్తుతున్నాయి. వాటిని చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తాడో అనేది చూడాల్సి ఉంది.