Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!
ప్రధానాంశాలు:
కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు
Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతున్నాయి. అమరావతి మహిళలు ఆగ్రహంతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా ఆడిపోసారు. అధికారంలోకి రాకముందు మహిళల విషయంలో పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పాలనలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారని ఆమె విమర్శించారు.

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!
Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ రోజా ఫైర్
మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. ఒక చిన్నారి పై జరిగిన అత్యాచారాన్ని నిష్పక్షపాతంగా విచారించాల్సిన చోటా, అధికార యంత్రాంగం దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం దారుణమని రోజా అభిప్రాయపడ్డారు. అనంతపురంలో గిరిజన విద్యార్థిని ఆరురోజులు కనిపించకపోయినా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల శవమై కనిపించిందని ఉదహరించారు. ఇటువంటి ఘటనలపై కూటమి సర్కారు నేతలు నిశ్శబ్దంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
మహిళలకు న్యాయం చేయాలని చెప్పే నాయకులు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసలు సమస్యల్ని దాచిపెడుతున్నారని రోజా తీవ్రంగా విమర్శించారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు రక్షణ లేకపోతే అది దుర్మార్గం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల శ్రద్ధను మళ్లించేందుకు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం కూటమి తీరుని నిందించారు. మరి రోజా ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెపుతారో..కూటమి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఒక మహిళ హోంమంత్రిగా ఉండి సాటి మహిళలకు రక్షణ కల్పించడం లేదంటే సిగ్గుపడాలి : మాజీ మంత్రి రోజా
నా నియోజకవర్గంలో ఒక చిన్న పాపని అత్యాచారం చేసి చంపేస్తే ఆ కేసును మాయ చేయాలని చూశారు
అనంతపురంలో తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు
అందుకే ఆ… pic.twitter.com/pRGzriSPwM
— BIG TV Breaking News (@bigtvtelugu) June 10, 2025