
RP : రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కిరాక్ ఆర్పీ.. అలా అనేశాడేంటి?
RP :ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్‌గా సాగుతుంది. ఈ సారి పవన్ కళ్యాణ్‌కి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పిఠాపురం వేదికగా పవన్ పోటీ చేస్తుండడంతో ఆయనని గెలిపించేందుకు బుల్లితెర సెలబ్రిటీలు, మెగా హీరోలు, కొందరు హీరోలు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే జనసేనకే బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల నుండి ఎక్కువగా మద్దుతు అందుతోంది. ముఖ్యంగా ‘జబర్దస్త్’ కమెడియన్లు చాలామంది పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ప్రచారాల్లో బిజీ అయిపోయారు. మరోవైపు అదే షోలో జడ్జిగా కనిపించిన రోజా.. వైసీపీ ప్రచారాల్లో వారిపై విమర్శలు కురిపిస్తూ ఉండగా, తాజాగా కిరాక్ ఆర్పీ.. ఒక ప్రెస్ మీట్‌లో స్పందించాడు. రోజాపై తాను కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సీఎం జగన్ పై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు.
నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు కిరాక్ ఆర్పీ . ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని అన్నాడు. విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ ఓడిపోతున్నాడని జోస్యం చెప్పాడు. జనసేన సపోర్టర్స్‌ను రోజా విమర్శిస్తున్నారని, దానిపై తన స్పందన ఏంటి అని ఆర్పీని అడగగా.. ‘‘మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటాం. గౌరవించకపోతే రోజా అంటాం. రోజా ఏం మాట్లాడింది.. ఆది, నేను, ఇలా కొందరు వెళ్లి పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అన్నది. మేమంతా చిన్న చిన్న ఆర్టిస్టులం అంటా. ఆమె ఏమైనా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా? ఆ యువరాణి ఏమైనా 10 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా? వాళ్లు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు.
RP : రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కిరాక్ ఆర్పీ.. అలా అనేశాడేంటి?
మీరు చేసే అవినీతిపై వ్యతిరేకత ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టుల అంటున్నావు కదా.. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను చేసే ఒక్క క్యారెక్టర్ అయినా నీ జీవితంలో చేయగలవా?’’ అంటూ ‘జబర్దస్త్’ ఆర్టిస్టులతో రోజాను పోలుస్తూ వ్యాఖ్యలు చేశాడు ఆర్పీ. ‘సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూ తన ఛరిష్మాతో సినిమా హీరో అయ్యాడు. నీకంటే వాడికి 10 రెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది తెలుసా. వాడితో నువ్వు పోటీ పడగలవా? ఆది వచ్చి జబర్దస్త్ చరిత్రనే మార్చాడు. నువ్వు పంచులకు జడ్జిమెంట్ ఇస్తే చాలు. ఆది అందరినీ గంటపాటు ఏకధాటిగా నవ్వించి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బ్రతుకులో ఎప్పుడైనా ఈ ముగ్గురిలాంటి ఛరిష్మా చూశావా? నిన్ను ఎవరూ ఏం మాట అననప్పుడు నీకెందుకు ఉనికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారి ఎమ్మెల్యేలలో ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణి. మా రోజమ్మ. నీకు నగరిలో డిపాజిట్లు కూడా రావు. మేము ఎప్పుడూ నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసుకుంటే నీకెందుకు’’ అంటూ రోజాపై సీరియస్‌గా ఫైర్ అయ్యాడు ఆర్పీ.
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…
Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…
Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…
Upasana Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
World Environment Day : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ హరిత ప్రాంతమైన KBR నేషనల్ పార్క్…
Thread Pochampally : తెలంగాణ చేనేత కళకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో…
Uppal MMC Office : హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యల్లో మల్కాజిగిరి మున్సిపల్…
Guava Farming Success Story : ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల…
Liquor Prices : తెలంగాణలో మద్యం సేవించే వారికి త్వరలోనే భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో లిక్కర్,…
Ration Card : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న…
This website uses cookies.