Avinash Reddy : అవినాష్ రెడ్డి మ్యాటర్ లో ఎల్లో మీడియా ఓవర్ రియాక్షన్..!
Avinash Reddy : ఎల్లో మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లో మీడియా ఎంతలా రెచ్చిపోతుందో తెలుసు కదా. ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తోంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పచ్చ మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తన తల్లికి సీరియస్ గా ఉంది.. అందుకే తాను సీబీఐ విచారణకు హాజరు కాలేను అని అవినాష్ రెడ్డి చెప్పినా కూడా దానిపై రాద్దాంతం చేస్తున్నారు. ఇదే విషయంపై సజ్జల కూడా అదే ప్రశ్నించారు. అనవసరంగా ఈకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ లాగిందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయం అందరికీ స్పష్టమైంది.
అసలు వైఎస్ ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసు. పైరవీలు చేసుకొని పబ్బం గడుపుకునే వారు కాదు. అలాంటి మనస్తత్వం కాదు వాళ్లది.. అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. నిజానికి సీబీఐ విచారణకు హాజరుకావడం కోసమే అవినాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని.. కాని తన తల్లికి బాగోలేనందున తిరిగి పులివెందులకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. దానికి ఇంత రాద్దాంతం ఎందుకు అని అవినాష్ రెడ్డి విషయంలో పచ్చ మీడియా చేస్తున్న రచ్చపై సజ్జల ప్రశ్నించారు.
Avinash Reddy : మీకు ఎందుకు అంత అత్యుత్సాహం
అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల సీబీఐ విచారణకు హాజరుకాలేకపోతే దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందా? ఒకవేళ అవినాష్ పాత్ర ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆయన్ను వదిలేవారా? ఆయన ఎక్కడికీ తప్పించుకొని పోవడం లేదు. ఆయనపై అనవసరంగా బురద జల్లుతున్నారు. అవినాష్ ఒక ఎంపీ అనే విషయం కూడా మరిచిపోయి మరీ ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పచ్చ మీడియాపై సజ్జల మండిపడ్డారు.