Avinash Reddy : ట్రాక్ మార్చిన అవినాష్ రెడ్డి… ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా…!
ప్రధానాంశాలు:
Avinash Reddy : ట్రాక్ మార్చిన అవినాష్ రెడ్డి... ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా...!
Avinash Reddy : ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కడప ఎంపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో వైయస్ అవినాష్ రెడ్డి తన సహజ స్వభావానికి భిన్నంగా స్వరం పెంచుతూ వస్తున్నారు. అయితే వాస్తవానికి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ,సౌమ్యుడిగా , నెమ్మదస్తుడిగా పేరు పొందిన వ్యక్తి. అయినప్పటికీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారాలలో భాగంగా వైయస్ షర్మిల మరియు వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత అవినాష్ పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ పోతున్నారు. చాలా కాలం నుండి సునీత దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అవినాష్ వీటిపై ఎన్నడూ స్పందించలేదు.
అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తాను నోరు మెదపకపోతే షర్మిల మరియు సునీత చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం అవుతాయని అవినాష్ రెడ్డి భావించినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇటీవల షర్మిల మరియు సునితలపై అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు వారిద్దరూ మనుషులేనా అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. అలాగే చంద్రబాబు నాయుడు పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి కూటమి చర్యల వలన సామాజిక పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , పెన్షన్ల పంపిణి లో ఈ విధమైన ఘోరాలకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని తెలిపారు.
Avinash Reddy : ప్రత్యర్ధుల నోర్లు మూయించిన అవినాష్ రెడ్డి..
ఎండకు తట్టుకోలేక చాలామంది పింఛన్ దారులు అనారోగ్యం పాలవుతున్నారని , అలాగే మరికొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు అవ్వ తాతలు గట్టి గుణపాఠం చెప్పాల్సిందిగా కోరారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి వైయస్ షర్మిల మరియు సునీతల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.దీంతో వైయస్ అవినాష్ రెడ్డి మార్పు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అయితే రానున్న ఎన్నికల రోజుల్లో ప్రతిపక్షాలపై అవినాష్ రెడ్డి మరింత ఎదురు దాడికి దిగాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ పలువురు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.