Avinash Reddy : రషీద్ హత్యపై అవినాష్ రెడ్డి స్పందన.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..!
ప్రధానాంశాలు:
Avinash Reddy : రషీద్ హత్యపై అవినాష్ రెడ్డి స్పందన.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..!
Avinash Reddy : వినుకొండలో జరిగిన రషీద్ హత్యోదంతాన్ని రాజకీయాన్ని చేయాలని చూస్తుంది వైసీపీ. వైసీపీ కార్య కర్త రషీద్ ను హత్య చేసినా ఉదంతంలో టీడీపీపై వైసీపీ ఎటాక్ చేస్తుంది. ఐతే అది రాజకీయ హత్య కాదని అంటున్నా సరే వైసీపీ పదే పదే ఆ మాట అంటుంది. రషీద్ మృతి విషయం తెలుసుకుని వైఎస్ జగన్ వినుకొండ వెళ్లి మరి అతని ఫ్యామిలీ పరామర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలు జరగడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాదు రాష్ట్రపతి పాలన రావాలని.. ఈ ప్రభుత్వం ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని అన్నారు. ఐతే ఇప్పుడు ఈ ఇష్యూపై అవినాష్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని.. వారు ఈ రాష్ట్రాన్ని బీహార్ కంటే ఘోరంగా చ్సేలా ఉన్నారని అన్నారు. రషీద్ హత్యపై అవినాష్ రెడ్డి స్పందించడం చూసి టీడీపీ వర్గాలు అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి.
Avinash Reddy వివేకా హత్య కేసు ఏమైందంటూ..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరి వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. అలాంటి ఆయన హత్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్న వేళ ఇలా అతను వచ్చి రషీద్ హత్య గురించి ఇది రాజకీయ హత్య అని.. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది.
రషీద్ హత్య కేసుని కంప్లీట్ గా వైసీపీ రాజకీయ హత్య అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తుంది. ఐతే నిజా నిజాలు ఏంటి అన్నది నిత్య వార్తల్లో తెలుసుకుంటున్న ప్రజలు అటు వైసీపీ చెబుతున్న విషయాలను.. ఇటు టీడీపీ చేస్తున్న కామెంట్స్ ని నిర్ధారించుకుంటున్నారు. బాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారన్న అవినాష్ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.