Sajjala : పార్టీ ప్రధాన కార్యదర్శిగా సజ్జలను సైడ్ చేయాల్సిందే.. వైసీపీలో డిమాండ్
ప్రధానాంశాలు:
Sajjala : పార్టీ ప్రధాన కార్యదర్శిగా సజ్జలను సైడ్ చేయాల్సిందే.. వైసీపీలో డిమాండ్
Sajjala : వైసీపీ నేతల నుంచి ఒకే ఒక్క డిమాండ్ తెరమీదికి వస్తోంది. తక్షణం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నుంచి సైడ్ చేయాలని. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో తన పదవికి తగిన హోదాతో అధికారం చెలాయించారు. తరచూ మీడియా ముందు వివరణలు ఇచ్చారు. రాష్ట్రంలోని ముఖ్యమైన సంఘటనలు లేదా రాజకీయ పరిణామాల సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తరచుగా అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ మీడియాతో స్పందిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించినప్పుడు, సాధారణంగా సజ్జల ముందుకు వచ్చేవారు. ముఖ్యమంత్రి మాటలను ప్రజలు కోరినప్పుడల్లా సజ్జల వివరణ ఇచ్చేవారు. తనను తాను ప్రొజెక్టు చేసుకునే క్రమంలో సజ్జల వ్యవహరించిన రాజకీయమేనని అంటున్నారు పార్టీ నాయకులు. అంతేకాదు. సజ్జలే శత్రువని అనంతపురం జిల్లాకు చెందిన రెడీ నాయకుడు(గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు) బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. ఇక, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు సహా అందరూ ఇదే మాట చెబుతున్నారు. సజ్జల ను సైడ్ చేయాల్సిందేనని ప్రకటిస్తున్నారు.
మరికొందరు మొహం మీదే చెప్పేస్తున్నారు. సజ్జల కారణంగానే తాము ప్రజల ముందు పలచన అయ్యామని చెప్పేస్తున్నారు. `ఏం చేయాలన్నా.. ఏం కావాలన్నా.. సజ్జల సార్ చెప్పారా? అని అధికారులు అడుగుతుంటే సిగ్గుతో అప్పుడే చచ్చిపోయాం` అని ఓ మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుంటూరు చెందిన నేత చెప్పడం సజ్జలపై పార్టీ ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేస్తోంది. తెనాలికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఇదే విషయమై వాపోయారు.
ఇప్పుడు సజ్జల కేంద్రంగానే వైసీపీ రాజకీయాలు సాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం నేతలతో భేటీ అయినప్పుడు కూడా సజ్జల పైనే నాయకులు ఆరోపణలు గుప్పించారు. ఇవి ఆరోపణలు కావని.. వాస్తవాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక, సీమ నాయకులు ఎప్పుడు మీటింగ్ పెడతారా? ఎప్పుడు దులిపేద్దామా? అని ఎదురు చూస్తున్నారు. మిగిలిన వైసీపీ నాయకులు అందరూ కూడా.. సజ్జలపై నిప్పులు చెరుగుతుండడం గమనార్హం.